ప్రేమించేదాక టార్చర్ చేసిదంటూ.. కన్నీళ్లు పెట్టుకున్న ఓ స్టార్ కమెడీయన్
జబర్దస్త్ ప్రారంభం నుంచి కమెడియన్‌గా నటిస్తూ.. ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తూ.. ప్రస్తుతం టీమ్ లీడర్‌గా కొనసాగుతున్నా స్టార్ కమెడీయన్ రాకేష్ తన ప్రేమ, పెళ్లి వెనకాల ఉన్న అసలు రహస్యాన్ని బయట పెట్టాడు.
దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ ప్రారంభం నుంచి కమెడియన్‌గా నటిస్తూ.. ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తూ.. ప్రస్తుతం టీమ్ లీడర్‌గా కొనసాగుతున్నా స్టార్ కమెడీయన్ రాకేష్ తన ప్రేమ, పెళ్లి వెనకాల ఉన్న అసలు రహస్యాన్ని బయట పెట్టాడు. ప్రముఖ న్యూస్ ఛానెల్లో ‘జోర్దార్’ ప్రోగ్రామ్‌కి యాంకర్‌గా వ్యవహరించి, తెలంగాణ యాసలో మాట్లాడి పాపులర్ అయిన సుజాత బిగ్‌బాస్ షోలో అలరించి, ఆ తర్వాత జబర్దస్త్ లో ఛాన్స్ రావడంతో రాకేష్ టీమ్‌లో కమెడియన్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. సుడిగాలి సుధీర్- రష్మి, ఇమ్మాన్యుయెల్-వర్ష ఇలా ప్రేమ జంటలుగా పాపులర్ అవుతున్న వారిలో రాకేష్-సుజాత కూడా ఒకరు.
ఈ క్రమంలో రాకేష్, సుజాతల మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమని చాలా సార్లు స్టేజ్‌పైన చెప్పారు. వీరిది నిజం ప్రేమ కాదని, షో కోసం చేస్తున్న హంగామా అని చాలా మంది భావించారు. కానీ అనూహ్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత గ్యాప్ లేకుండానే పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు మళ్లీ జబర్దస్త్ లో స్కిట్లు చేస్తున్నారు. అయితే తాజాగా రాకేష్ వీరి ప్రేమ ,పెళ్లి వెనకున్న నిజాన్ని బయటపెట్టాడు. తనని ప్రేమించమని సుజాత రోజూ టార్చర్ చేసేదని, జబర్దస్త్ వేదికపైన మాట్లాడుతూ.. రాకేష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో అంతా షాక్ అయ్యారు. ఇక పక్కనే ఉన్న సుజాతకి మైండ్ బ్లాంక్ అయ్యింది. వెంటనే ఆమె ఆ.. అంటూ నోరు తెరిచింది. రాకేష్ చెప్పిన నిజంతో మిగిలిన కమెడియన్లందనూ షాక్‌లోకి వెళ్లిపోయారు.
కానీ అది నిజం కాదు. ఇదంతా ‘‘ఎక్స్ ట్రా జబర్దస్త్’’ స్కిట్లో భాగంగా చేశారు. నిజం చెబితే కాయ చెట్టుపైకి వెళ్తుందని, అబద్దం చెబితే కదలదనేది స్కిట్ కాన్సెప్ట్. అందులో భాగంగా మొదట తమది నిజమైన ప్రేమ అని, గాఢమైన ప్రేమ అని రాకేష్ చెప్పగా కాయ కదల్లేదు కానీ ప్రేమించమని, పెళ్లికోసం టార్చర్ చేసిందని రాకేష్ చెప్పడంతో కాయ పైకి వెళ్లింది. దీంతో ఒక్కసారిగా షోలో ఉన్నవారంతా పగలబడి నవ్వారు. ఈ షో ఈ శుక్రవారం ఈటీవీలో ప్రసారం కానుంది.
ఇవి కూడా చదవండి: Nani Son Birthday: కొడుకు బర్త్‌డే.. క్యూట్ పిక్ షేర్ చేసిన నాని