బ్రో.. ఐ డోంట్ కేర్.. Balayya ‘Bhagavanth Kesari’ నుంచి సాలిడ్ Video Release..

నందమూరి బాల‌కృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న క్రేజీయెస్ట్‌ ప్రాజెక్ట్‌ ‘భగవంత్ కేసరి’ నుంచి సాలిడ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.

Update: 2023-09-28 12:45 GMT
బ్రో.. ఐ డోంట్ కేర్.. Balayya ‘Bhagavanth Kesari’ నుంచి సాలిడ్ Video Release..
  • whatsapp icon

దిశ, సినిమా: నందమూరి బాల‌కృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న క్రేజీయెస్ట్‌ ప్రాజెక్ట్‌ ‘భగవంత్ కేసరి’ నుంచి సాలిడ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. కాజల్ అగర్వాల్‌, శ్రీలీల, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటిస్తున్న మూవీ నుంచి ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇస్తానని అనిల్ ఇటీవలే ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ మానిటర్‌లో సీన్‌ చెక్ చేసుకుంటున్న ఫొటో నెట్టింట పోస్ట్ చేసిన దర్శకుడు.. అంతా అనుకున్నట్టుగానే షూటింగ్‌ ప్యాకప్ చెప్పేసిందంటూ ఓ వీడియో కూడా షేర్ చేశాడు.

‘డిసెంబర్ 8, 2022న భగవంత్‌ కేసరి చిరస్మరణీయ షూటింగ్‌ జర్నీని ప్రారంభించి.. కష్టతరమైన, సంతోషకరమైన 8 నెలల షూటింగ్‌ తర్వాత పూర్తి చేశాం. సెట్స్‌లో ఎప్పుడూ సపోర్ట్‌గా నిలిచిన లెజెండ్ నందమూరి బాలకృష్ణకు, నా టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు.ఈ దసరా మనందరికీ విశేషమైంది కాబోతుందని ఖచ్చితంగా అనుకుంటున్నా. అక్టోబర్ 19న థియేటర్లలో కలుద్దాం’ అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ప్రజంట్ ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

Tags:    

Similar News