Chiranjeevi పై ఈయనకున్న అభిమానానికి సెల్యూట్.. చిరు కోసం ఏమి చేసాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగ జరుగుతున్నాయి

Update: 2023-08-21 13:23 GMT

దిశ,వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగ జరుగుతున్నాయి. ఒక అభిమాని మన్యం వీరుడు, అల్లూరి సీతారామ రాజు వేషధారణలో కనిపించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను చెప్పిన మాటలు వింటే ఒక మనిషి మీద ఇంత అభిమానం చూపిస్తారా అని సందేహం ఉండదు.. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే..

'అన్నయ్య చిరంజీవి కోసం తూర్పు గోదావరి జిల్లా సోమేశ్వరం నుంచి నుంచి వచ్చాను. మెగా ప్రోగ్రామ్స్ ఎక్కడా జరిగిన ఈ సీతారామరాజు వేషధారణ వేస్తాను, ఎక్కువ శాతం బ్లడ్ క్యాంపులకు హాజరవుతాను.. ఎందుకంటే అన్నయ్య త్యాగశీలి, ప్రతి సారి ప్రజల కోసం, దేశం కోసం, తపిస్తూ ఆయన సంపాదించిన దానిలో కొంత ప్రజల కోసం వెచ్చిస్తూ.. సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అన్నయ్య పిలుపు మేరకు నేను ఇప్పటికి 48 సార్లు బ్లడ్ డొనేట్ చేశానని తెలిపారు. అన్నయ్య ఆరోగ్యంగా ఉండాలని రెండు రోజుల పాటు ఉపవాస దీక్షలో కేవలం మంచి నీళ్లు మాత్రమే తీసుకుంటానని' చిరు పై ఉన్న అభిమనాన్ని చాటుకున్నాడు. దీనిపై స్పందించిన నెటిజెన్స్, చిరు ఫ్యాన్స్ తమ్ముడు నువ్వు గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

ఇవి కూడా చదవండి : Pawan Kalyan కొడుకు ఫొటో షేర్ చేసిన దర్శకేంద్రుడు.. సినిమాలకు సిద్ధమయినట్లేనా..?

Tags:    

Similar News