సుధీర్ బాబు యాక్షన్ మూవీ 'హంట్' ఫస్ట్ లుక్..

దిశ, సినిమా : యంగ్ హీరో సుధీర్ బాబు ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ప్రేమ‌ క‌థ‌లు, వినోదాత్మక క‌థాంశాలతో కూడిన వైవిధ్యమైన స్క్రిప్ట్‌లకే ప్రాధాన్యతనిచ్చాడు.

Update: 2022-08-28 13:03 GMT

దిశ, సినిమా : యంగ్ హీరో సుధీర్ బాబు ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ప్రేమ‌ క‌థ‌లు, వినోదాత్మక క‌థాంశాలతో కూడిన వైవిధ్యమైన స్క్రిప్ట్‌లకే ప్రాధాన్యతనిచ్చాడు. ప్రస్తుతం ఆయన మ‌హేశ్ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తుండగా.. ఆదివారం టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 'హంట్' అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. ఈ చిత్రంలో సుధీర్ బాబు పవర్‌ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. కాగా ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. ఇదేగాక మోహ‌న‌కృష్ణ ఇంద్రగంటి ద‌ర్శక‌త్వంలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే చిత్రం చేస్తున్న సుధీర్ బాబు సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Tags:    

Similar News