బాలీవుడ్‌కి ఊరట.. వంద కోట్ల క్లబ్‌లో Drishyam 2

వరుస పరాజయాలతో సతమతమవుతున్న బాలీవుడ్ సినిమా పరిశ్రమకి ఊరట లభించింది.

Update: 2022-11-24 02:37 GMT

దిశ, వెబ్ డెస్క్: వరుస పరాజయాలతో సతమతమవుతున్న బాలీవుడ్ సినిమా పరిశ్రమకి ఊరట లభించింది. అజయ్ దేవ్‌గన్ హీరోగా నటించిన దృశ్యం సినిమాకి కొనసాగింపుగా వచ్చిన దృశ్యం-2 విడుదలైన తొలి వారంలో రూ.100 కోట్లు వసూలు చేసి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో శ్రీయా, టబూ, అక్షయ్ ఖన్నా, మృనాల్ జాదవ్, ఇషితా దత్తా ప్రధాన పాత్రదారులుగా నటించారు. కాగా తెలుగు దృశ్యం తొలి భాగంలో వెంకటేశ్, మీనా నటించిన విషయం తెలిసిందే. వరుస పరాజయాలతో ఢీలా పడ్డ బాలీవుడ్ సినిమాకి బ్రహ్మస్త్ర కలెక్షన్స్ కొంత ఊపునిచ్చాయి. తర్వాత దృశ్యం -2 ఆశించిన ఫలితాలు రాబట్టగలిగింది. 

Tags:    

Similar News