మధ్యతరగతి గృహిణిల మారిపోయిన నివేదా థామస్.. లుక్ వైరల్

హీరోయిన్ నివేదా థామస్ చాలా గ్యాప్ తర్వాత ‘35 చిన్న కథ కాదు’ సినిమాతో ఆడియన్స్‌ను అలరించనుంది.

Update: 2024-07-03 08:10 GMT

దిశ, సినిమా: హీరోయిన్ నివేదా థామస్ చాలా గ్యాప్ తర్వాత ‘35 చిన్న కథ కాదు’ సినిమాతో ఆడియన్స్‌ను అలరించనుంది. డెబ్యూ డైరెక్టర్ నందకిశోర్ దర్శకత్వం వహిస్తు్న్న ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గబాటి సమర్పిస్తున్నాడు. ప్రియదర్శి, యువ నటుడు విశ్వదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తు్న్న ఈ సినిమా ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గరలోనే ఉండటంతో వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు చిత్ర బృందం.

ఈ మేరకు తాజాగా ‘35 చిన్న కథ కాదు’ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నివేదా ఓ మధ్యతరగతి గృహిణిల కనిపించగా.. తన చుట్టూ పిల్లలు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. పోస్టర్ బట్టి చూస్తుంటే.. మిడిల్ క్లాస్ వ్యక్తులు పడే కష్టాలు, సంతోషాలను బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. నివేదా లుక్‌కు ఫిదా అవుతున్నారు నెటిజన్లు.


Similar News