అత్యంత వేగంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘2018’
ఈ మధ్య కాలంలో మూవీ లవర్స్‌కు భాషాపరమైన హద్దులు చెరిగిపోయాయి.
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో మూవీ లవర్స్‌కు భాషాపరమైన హద్దులు చెరిగిపోయాయి. అందుకే ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘బ్రో డాడీ’, ‘లూసిఫర్’, ‘దృశ్యం 2’ వంటి ఇతర భాషా చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ‘2018’ మూవీ కూడా ఇలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుంది. 2018 కేరళ వరదల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహించగా టోవినో థామస్, ఆసిఫ్ అలీ, కుంచకో బోబన్, లాల్, నరైన్, వినీత్ శ్రీనివాస్, అపర్ణ బాలమురళి, తన్వి తదితరులు ప్రధానపాత్రల్లో కనిపించారు. మే 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయిన చిత్రం బ్లాక్ బస్టర్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. కాగా ఈ తొమ్మిది రోజుల్లో రూ. 80 కోట్ల ప్లస్ కలెక్ట్ చేసి ప్రస్తుతం రూ. 100 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :
Balagam Movie :‘బలగం’ సినిమా నుండి ఏం నేర్చుకుందాం..?
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మృణాల్.. తొలిసారి హాజరవుతుండటంపై ఎగ్జయిట్మెంట్