జంతువులే కాని వాటికి మనసు ఉంటుంది.. వైరల్‌గా మారిన వీడియో

దిశ, వెబ్‌డెస్క్: జంతువులలో అతి తెలివైనది ఏదైన ఉందంటే అది ఏనుగు. అవి అనేక రకాల భావోద్వేగాలను అనుభవించగలవు, అర్థం చేసుకోగలవు. మనలో ఒకరు మరణిస్తే మనం ఎలా బాధ పడతామో.. అవి కూడా వాటితోపాటు ఉన్న తోటి ఏనుగు చనిపోతే అలాగే బాధ పడతాయి. అందుకు నిదర్శనంగా ఇప్పడు ఓ ఏనుగు వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక తల్లి ఏనుగు తన మూడేళ్ల వయసుగల చిన్న ఏనుగును బ్రతికించి.. తన వెంట తీసుకెళ్లడానికి అనేక […]

Update: 2021-11-18 08:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: జంతువులలో అతి తెలివైనది ఏదైన ఉందంటే అది ఏనుగు. అవి అనేక రకాల భావోద్వేగాలను అనుభవించగలవు, అర్థం చేసుకోగలవు. మనలో ఒకరు మరణిస్తే మనం ఎలా బాధ పడతామో.. అవి కూడా వాటితోపాటు ఉన్న తోటి ఏనుగు చనిపోతే అలాగే బాధ పడతాయి. అందుకు నిదర్శనంగా ఇప్పడు ఓ ఏనుగు వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక తల్లి ఏనుగు తన మూడేళ్ల వయసుగల చిన్న ఏనుగును బ్రతికించి.. తన వెంట తీసుకెళ్లడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది.

ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో చోటుచేసుకుంది. బోర్‌వెల్‌కు కనెక్ట్ చేయబడిన లైవ్ వైర్‌ను ఏనుగు తాకినట్లు తెలుస్తోందని ”డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్‌ఓ) కుర్ర శ్రీనివాస్ చెప్పారు. ఈ క్రమంలో విద్యుత్ ముళ్ల తీగలు ఏర్పాటు చేయడం వల్ల తరచూ ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయని కొందరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను చూసిన నెటిజన్‌లు మనుషులుగా మనం వాటికి ఏం చేయకపోయినా ఫర్వాలేదుకానీ వాటి చావుకు మాత్రం కారణం కాకూడదని కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News