బుజ్జి పిల్లుల్ని ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లి పిల్లి… వైద్యం చేసిన డాక్టర్లు (వీడియో)

దిశ, ఫీచర్స్: తల్లి ప్రేమకు కొలమానాలు ఉండవు. బిడ్డను కాపాడుకునేందుకు ఎంత దూరమైన వెళ్తుంది. ఎన్ని త్యాగాలైనా చేస్తుంది. చావు నోట్లో తల పెట్టైనా సరే తన బిడ్డల్ని దక్కించుకుంటుంది. అందుకు ప్రపంచాన్నైనా ఎదిరిస్తుంది. ఇది కేవలం మనుషుల్లో మాత్రమే కాదు జంతువుల్లోనూ చాలా సందర్భాల్లో చూసి ఉంటాం. ఈ క్రమంలో ఓ పిల్లి తన బిడ్డను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం ప్రపంచాన్నే మెల్ట్ చేసింది. బిడ్డ అనారోగ్యాన్ని చూసి తట్టుకోలేని తల్లి పిల్లి.. దాన్ని నోట […]

Update: 2021-03-30 10:47 GMT

దిశ, ఫీచర్స్: తల్లి ప్రేమకు కొలమానాలు ఉండవు. బిడ్డను కాపాడుకునేందుకు ఎంత దూరమైన వెళ్తుంది. ఎన్ని త్యాగాలైనా చేస్తుంది. చావు నోట్లో తల పెట్టైనా సరే తన బిడ్డల్ని దక్కించుకుంటుంది. అందుకు ప్రపంచాన్నైనా ఎదిరిస్తుంది. ఇది కేవలం మనుషుల్లో మాత్రమే కాదు జంతువుల్లోనూ చాలా సందర్భాల్లో చూసి ఉంటాం. ఈ క్రమంలో ఓ పిల్లి తన బిడ్డను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం ప్రపంచాన్నే మెల్ట్ చేసింది. బిడ్డ అనారోగ్యాన్ని చూసి తట్టుకోలేని తల్లి పిల్లి.. దాన్ని నోట కరుచుకని హాస్పిటల్‌కు తీసుకెళ్లిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ ఘటన సౌత్ టర్కీలో జరిగింది. సహాయం కోసం వచ్చిన తల్లి పిల్లికి ఆ హాస్పిటల్ డాక్టర్లు, నర్సులు హెల్ప్ చేశారు. బుజ్జి పిల్లిని ఎగ్జామిన్ చేసి ఐ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతుందని తెలుసుకున్న వైద్యులు తగిన ట్రీట్‌మెంట్ అందించారు. అంతేకాదు ఆ తల్లి పిల్లికి పుట్టిన మరో బుజ్జి పిల్ల జాడ కూడా తెలుసుకుని, ఫ్యూచర్‌లో తనకు కూడా ఇలాంటి ఇన్‌ఫెక్షన్ రాకుండా ఐ డ్రాప్స్ వేశారు. ఈ వీడియోను యూఏఈ మీడియా సంస్థ ‘గల్ఫ్ టుడే’ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో ట్రెండవుతోంది.

Tags:    

Similar News