KL Rahul కు సర్జరీ సక్సెస్

KL Rahul undergoes successful surgery in Germany| టీమ్ ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ గజ్జలో గాయం కారణంగా సౌతాఫ్రికా సిరీస్‌‌తోపాటు ఇంగ్లాండ్ పర్యటనకు దూరమైన విషయం తెలిసిందే. చికిత్స నిమిత్తం జర్మనీ వెళ్లిన రాహుల్‌కు తాజాగా నిర్వహించిన సర్జరీ విజయవంతమైంది.

Update: 2022-06-30 12:39 GMT

న్యూఢిల్లీ : KL Rahul undergoes successful surgery in Germany| టీమ్ ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ గజ్జలో గాయం కారణంగా సౌతాఫ్రికా సిరీస్‌‌తోపాటు ఇంగ్లాండ్ పర్యటనకు దూరమైన విషయం తెలిసిందే. చికిత్స నిమిత్తం జర్మనీ వెళ్లిన రాహుల్‌కు తాజాగా నిర్వహించిన సర్జరీ విజయవంతమైంది. తన ఆరోగ్యంపై రాహుల్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు. 'గాయం కారణంగా కొన్ని వారాల నుంచి కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఇప్పుడు నా సర్జరీ పూర్తయింది. నేను కోలుకుంటున్నాను. నా ఆరోగ్యం బాగుండాలని ప్రార్థించిన అభిమానులందరికీ ధన్యవాదాలు. త్వరలోనే కలుస్తా' అని రాహుల్ ట్వీట్ చేశాడు. సర్జరీ కావడంతో రాహుల్ మరో రెండు నెలలపాటు ఆటకు దూరంగా ఉంటాడని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల చివర్లో వెస్టిండీస్ పర్యటనకు రాహుల్ దూరం కానున్నాడు. మరోవైపు, ఆగస్టులో జరిగే ఆసియా కప్‌లో సైతం రాహుల్ పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి. సర్జరీ పూర్తి చేసుకున్న రాహుల్ వారం తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లి శిక్షణ తీసుకోనున్నాడు.

Tags:    

Similar News