ఢిల్లీలో ఆ ప్లాన్ అమలు!
న్యూఢిల్లీ: దేశరాజధానిలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమావేశంలో 12 పాయింట్ ప్లాన్‌ను అమలు చేయడానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా కరోనా టెస్టులను రెట్టింపు చేయనున్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 60వేల టెస్టులు జరుగుతుండగా, వీటిని లక్షకు పెంచనున్నారు. అలాగే, ఐసీయూ బెడ్‌ల కొరతను అధిగమించడానికి డీఆర్‌డీవో సెంటర్‌లో 750 బెడ్లను వినియోగించుకోవడానికి కేంద్రం అనుమతించిందని సీఎం కేజ్రీవాల్ సమావేశానంతరం తెలిపారు. వర్షమొచ్చింది.. కాలుష్యం నుంచి […]
న్యూఢిల్లీ: దేశరాజధానిలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమావేశంలో 12 పాయింట్ ప్లాన్‌ను అమలు చేయడానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా కరోనా టెస్టులను రెట్టింపు చేయనున్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 60వేల టెస్టులు జరుగుతుండగా, వీటిని లక్షకు పెంచనున్నారు. అలాగే, ఐసీయూ బెడ్‌ల కొరతను అధిగమించడానికి డీఆర్‌డీవో సెంటర్‌లో 750 బెడ్లను వినియోగించుకోవడానికి కేంద్రం అనుమతించిందని సీఎం కేజ్రీవాల్ సమావేశానంతరం తెలిపారు.
వర్షమొచ్చింది.. కాలుష్యం నుంచి ఊరట తెచ్చింది:
బాణాసంచాపై నిషేధాన్ని ఉల్లంఘిస్తూ దీపావళి రోజున క్రాకర్స్ కాల్చడంతో తర్వాతి రోజు ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగింది. దీనికి పొరుగురాష్ట్రంలో పంటవ్యర్థాలను కాల్చడం తోడైంది. అయితే, ఆదివారం మధ్యాహ్నం నుంచి ఢిల్లీ వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపించాయి. వేగంగా గాలులు వీచడం, ఒక్కపెట్టుగా వర్షం దంచి కొట్టడంతో కాలుష్య తీవ్రత కొద్ది మేరకు తగ్గింది. ఈ రోజు నుంచి కాలుష్య సమస్య కొంత తగ్గవచ్చునని వాతావరణ శాఖ తెలపడం గమనార్హం.