ఐపీఎల్‌పై కరోనా పంజా… పెరుగుతున్న కేసులు
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 13వ సీజన్ కోసం యూఏఈ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు సహా మొత్తం 13 మంది కరోనా మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. అంతేగాకుండా తాజాగా ఒక బీసీసీఐ అధికారి కూడా కరోనా బారిన పడినట్టు తెలుస్తున్నది. ఏకంగా బీసీసీఐ మెడికల్ టీం అధికారికే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు సమాచారం. బీసీసీఐలో సీనియర్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆయనకు లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ వచ్చింది. […]
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 13వ సీజన్ కోసం యూఏఈ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు సహా మొత్తం 13 మంది కరోనా మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. అంతేగాకుండా తాజాగా ఒక బీసీసీఐ అధికారి కూడా కరోనా బారిన పడినట్టు తెలుస్తున్నది. ఏకంగా బీసీసీఐ మెడికల్ టీం అధికారికే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు సమాచారం. బీసీసీఐలో సీనియర్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆయనకు లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ వచ్చింది.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని బోర్డు తెలియజేసింది. అతను యూఏఈలో ఎవరినీ కలవలేదని.. రాగానే హోటల్ రూంకే పరిమితం అయ్యారని బోర్డు చెప్పింది. ఆయనకు ప్రయాణ సమయంలోనే కరోనా సోకి ఉంటుందనే బోర్డు అనుమానం వ్యక్తం చేసింది. మరోవైపు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ సభ్యులు ఇద్దరు కరోనా బారిన పడినట్టు తెలుస్తున్నది. వారిద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం ఎన్‌సీఏలోనే వాళ్లు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. బీసీసీఐ, ఎన్‌సీఏ అధికారులు వరుసగా కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.