భారత వృద్ధి రేటు తగ్గించిన మూడీస్
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాదికి భారత వృద్ధి రేటు 9.6 శాతానికి పరిమితం కావొచ్చని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనా వేసింది. ఇదివరకు వెల్లడించిన 13.9 శాతం అంచనాలను సవరిస్తూ మూడీస్ బుధవారం మాక్రో ఎకనమిక్స్ ఇండియా పేరుతో వివరాలను విడుదల చేసింది. జూన్ త్రైమాసికంలో ఆర్థిక లోటును పరిమితం చేసేందుకు కరోనా టీకా పంపిణీ వేగవంతం చేయాలని మూడీస్ సూచించింది. సెకెండ్ వేవ్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది వృద్ధి […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాదికి భారత వృద్ధి రేటు 9.6 శాతానికి పరిమితం కావొచ్చని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనా వేసింది. ఇదివరకు వెల్లడించిన 13.9 శాతం అంచనాలను సవరిస్తూ మూడీస్ బుధవారం మాక్రో ఎకనమిక్స్ ఇండియా పేరుతో వివరాలను విడుదల చేసింది. జూన్ త్రైమాసికంలో ఆర్థిక లోటును పరిమితం చేసేందుకు కరోనా టీకా పంపిణీ వేగవంతం చేయాలని మూడీస్ సూచించింది. సెకెండ్ వేవ్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది వృద్ధి అంచనాలపై తీవ్రమైన ప్రభావం ఉందని, అయితే దీనివల్ల ఆర్థిక నష్టం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉందని మూడీస్ అభిప్రాయపడింది.
దీంతో ప్రస్తుత ఏడాదిలో భారత వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 9.6 శాతంగా, 2022లో 7 శాతంగా ఉంటుందని మూడీస్ వివరించింది. కొవిడ్ టీకా పంపిణీ వేగవంతం, లాక్‌డౌన్ కఠిన నిబంధనల సడలింపు వల్ల ఈ ఏడాది రెండో సగంలో ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతాయని మూడీస్ అభిప్రాయపడింది. అయితే, ఉద్యోగం, ఆదాయ నష్టం, మధ్య తరగతి, దిగువ తరగతి వర్గాల ఆదాయంలో క్షీణత వల్ల ప్రైవేట్ వినియోగం దెబ్బతినే అవకాశం ఉందని మూడీస్ వెల్లడించింది.