జూన్ 1న కేరళకు రుతుపవనాలు
న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాలు వచ్చే నెల 1వ తేదీనాటికి కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశమున్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. గతంలో జూన్ 5వ తేదీనాటికి ఈ రాష్ట్రంలోకి చేరవచ్చునని వెల్లడించిన ఐఎండీ తాజాగా, అంతకుముందే ప్రవేశించవచ్చునని అంచనా వేసింది. ఆగ్నేయం, తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దీని ఫలితంగా రుతుపవనాలు వేగంగా మనదేశంలోకి ప్రవేశించవచ్చునని వివరించింది. బుధవారం నుంచి ఈ పరిస్థితులు కనిపిస్తున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే జూన్ 1వ తేదీనాటికి నైరుతి […]
న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాలు వచ్చే నెల 1వ తేదీనాటికి కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశమున్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. గతంలో జూన్ 5వ తేదీనాటికి ఈ రాష్ట్రంలోకి చేరవచ్చునని వెల్లడించిన ఐఎండీ తాజాగా, అంతకుముందే ప్రవేశించవచ్చునని అంచనా వేసింది. ఆగ్నేయం, తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దీని ఫలితంగా రుతుపవనాలు వేగంగా మనదేశంలోకి ప్రవేశించవచ్చునని వివరించింది. బుధవారం నుంచి ఈ పరిస్థితులు కనిపిస్తున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే జూన్ 1వ తేదీనాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్టు తెలిపింది.