category: latest/telangana-medak డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో మెదక్
దిశ, మెదక్: కరోనా వ్యాధి నివారణకు లాక్‌డౌన్ మరింత పకడ్బంధీగా నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని మెదక్ సబ్ డివిజన్ డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. డ్రోన్ కెమెరా సహాయంతో ఉదయం, సాయంత్రం పట్టణంలోని ప్రధాన రోడ్లు, ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మెదక్ డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన లాక్‌డౌన్‌కు మెదక్ పట్టణ ప్రజలు జిల్లా పోలీస్ సిబ్బందికి సహకరిస్తున్నారన్నారు. కానీ, కొందరు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు […]
దిశ, మెదక్: కరోనా వ్యాధి నివారణకు లాక్‌డౌన్ మరింత పకడ్బంధీగా నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని మెదక్ సబ్ డివిజన్ డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. డ్రోన్ కెమెరా సహాయంతో ఉదయం, సాయంత్రం పట్టణంలోని ప్రధాన రోడ్లు, ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మెదక్ డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన లాక్‌డౌన్‌కు మెదక్ పట్టణ ప్రజలు జిల్లా పోలీస్ సిబ్బందికి సహకరిస్తున్నారన్నారు. కానీ, కొందరు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అనసరంగా ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారని తెలియజేశారు. నిత్యావసర వస్తువుల దుకాణాల వద్ద తప్పకుండా భౌతిక దూరం పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నామని ఆయన వివరణ ఇచ్చారు.
Tags: Drone camera, Monitoring, DSP krishna murthi, Medak