హుజురాబాద్‌లో జోరుగా ధూంధాం ప్రోగ్రామ్స్.. దివ్యాంగుడు ఆవేదన
దిశ ప్రతినిది, కరీంనగర్: హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ ఓటమి కోసం అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్రతి విషయాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలకు శ్రీకారం చుట్టిన అధికార పార్టీ.. సోమవారం రాత్రి నుండి ధూంధాం ప్రోగ్రామ్స్ ను నిర్వహిస్తోంది. హుజురాబాద్ మండలం కందుగుల, జమ్మికుంట మండలం వావిలాలల్లో ధూంధాంలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాల కిషన్ కందుగులలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఆడిపాడారు. ఈ సందర్భంగా ఈటలపై […]
దిశ ప్రతినిది, కరీంనగర్: హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ ఓటమి కోసం అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్రతి విషయాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలకు శ్రీకారం చుట్టిన అధికార పార్టీ.. సోమవారం రాత్రి నుండి ధూంధాం ప్రోగ్రామ్స్ ను నిర్వహిస్తోంది. హుజురాబాద్ మండలం కందుగుల, జమ్మికుంట మండలం వావిలాలల్లో ధూంధాంలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాల కిషన్ కందుగులలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఆడిపాడారు. ఈ సందర్భంగా ఈటలపై రసమయి విరుచుకుపడ్డారు.
దివ్యాంగుడి ఆవేదన
జమ్మికుంట మండలం వావిలాలలో నిర్వహించిన ధూం ధాం కార్యక్రమం రసాభసాగా మారింది. కళాకారులు ఆడి పాడిన తరువాత ఓ దివ్యాంగుడు తనకు పెన్షన్ రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మడుపు రాజేష్ అనే దివ్యాంగుడు డయాస్ ఎక్కి ఏడాదిగా తనకు పెన్షన్ రాలేదని, నాకు ఏమిచ్చారని భయపడాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రాజేష్ ను వేదికపై నుండి దింపేందుకు స్థానిక టీఆర్ఎస్ నాయకుడు లాక్కెళ్లే ప్రయత్నం చేసినా.. వేదిక మాత్రందిగలేదు. ఈ క్రమంలో డయాస్ పైనే రాజేష్ పడిపోయాడు. టీఆర్‌ఎస్ దౌర్జన్యం డౌన్ డౌన్ అంటూ నిరసన తెలిపారు
డబ్బుల పంపకం…
ధూం ధాం సభలకు హాజరైన వారికి డబ్బులు పంచిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధూంధాం సభలకు వచ్చే వారికి కూడా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందా అంటూ సెటైర్లు వేస్తున్నారు కొందరు నెటిజన్లు.