సోమవారం పంచాంగం, రాశి ఫలాలు (03-05-2021)
శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం బహుళ పక్షం తిధి : సప్తమి సా6.57 తదుపరి అష్టమి వారం : సోమవారం (ఇందువాసరే) నక్షత్రం : ఉత్తరాషాఢ మ 1.31 తదుపరి శ్రవణం యోగం : శుభం రా 2.23 తదుపరి శుక్లం కరణం : భద్ర/విష్ఠి ఉ 7.41 తదుపరి బవ సా 6.57 ఆ తదుపరి బాలువ వర్జ్యం : సా 5.26 – 7.00 దుర్ముహూర్తం : […]
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం బహుళ పక్షం
తిధి : సప్తమి సా6.57
తదుపరి అష్టమి
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : ఉత్తరాషాఢ మ 1.31
తదుపరి శ్రవణం
యోగం : శుభం రా 2.23
తదుపరి శుక్లం
కరణం : భద్ర/విష్ఠి ఉ 7.41
తదుపరి బవ సా 6.57
ఆ తదుపరి బాలువ
వర్జ్యం : సా 5.26 – 7.00
దుర్ముహూర్తం : మ 12.21 – 1.11 &
మ 2.52 – 3.43
అమృతకాలం: ఉ 7.20 – 8.53 &
రా 2.52 – 4.26
రాహుకాలం : ఉ 7.30 – 9.00
యమగండం/కేతుకాలం: మ 10.30 – 12.00
సూర్యరాశి: మేషం || చంద్రరాశి: మకరం
సూర్యోదయం: 5.37 || సూర్యాస్తమయం: 6.15
రాశి ఫలితాలు
మేషం
సమాజంలో నూతన పరిచయాలు పెరుగుతాయి ఆప్తుల నుండి శుభవర్తమానాలు అందుతాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు అనుకూలిస్తాయి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృషభం
ఆర్థికవ్యవహారాలలో లోటుపాట్లుఉంటాయి. అనుకోని ప్రయాణాలు శ్రమను కలిగిస్తాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి.కీలక వ్యవహారాలలో శిరోభాదాలు తప్పవు వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
మిధునం
ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనుకున్న సమయానికి ధనం అందక రుణఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలు స్వల్పముగా లాభిస్తాయి, నిరుద్యోగులు ప్రయత్నం మీద అవకాశములు అందుకుంటారు.
కర్కాటకం
నిరుద్యోగ అవకాశములు మెరుగుపడతాయి. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు చేపడతారు.
సింహం
సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలలో కార్యజయం. కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది నూతన వాహనయోగం ఉన్నది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కన్య
ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. అకారణంగా బంధువులతో తగాదాలు కలుగుతాయి. సంతాన అనారోగ్య విషయాలు బాధిస్తాయి. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమౌతారు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కోపం అదుపులో ఉంచడం మంచిది.
తుల
కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. బంధు మిత్రుల మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి, ఉద్యోగ విషయమై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు.
వృశ్చికం
కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగములలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. స్ధిరాస్తి లాభం కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విహార యాత్రలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి.
ధనస్సు
నూతన రుణాలు ప్రయత్నాలు చేస్తారు.అధిక శ్రమతోకాని పనులు పూర్తి కావు. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందక ఇబ్బంది కలుగుతుంది. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. మిత్రుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు కలసిరావు ఉద్యోగులకు అదనపు పనిభారం కలుగుతుంది.
మకరం
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కావలసిన బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు జీత భత్యముల విషయంలో శుభవార్తలు వింటారు.
కుంభం
చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు ధన పరంగా ఇబ్బంది కలుగుతుంది. ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.
మీనం
ఆర్ధిక వ్యవహారాలు లాభసాటిగాసా గుతాయి. అవసరానికి అందరి సహాయం అందుతుంది. పాత మిత్రులతో కలిసి కొన్ని విషయాలు గూర్చి చర్చలు చేస్తారు. గృహనిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఉత్సహకారంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.