సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు: షబ్బీర్ అలీ

దిశ, నిజామాబాద్: తెలంగాణ ప్రజల ప్రాణాల పట్ల సీఎం కేసీఆర్‎కు చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందితే.. ఆయనకు నివాళులు అర్పించే తీరిక సీఎంకు లేదా అని నిలదీశారు. కరోనాపై కేసీఆర్ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రం క్లాసిక్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో షబ్బీర్ అలీ ఈ […]

Update: 2020-06-19 07:32 GMT

దిశ, నిజామాబాద్: తెలంగాణ ప్రజల ప్రాణాల పట్ల సీఎం కేసీఆర్‎కు చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందితే.. ఆయనకు నివాళులు అర్పించే తీరిక సీఎంకు లేదా అని నిలదీశారు. కరోనాపై కేసీఆర్ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రం క్లాసిక్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో షబ్బీర్ అలీ ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు బార్డర్లో వీరమరణం పొందిన సైనికులకు నివాళిగా రెండు నిమిషాల పాటు మౌనం వహించారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. భారత్ చైనా సరిహద్దులో 20 మంది సైనికులు మరణించడం బాధాకరమన్నారు. కేసీఆర్ సినిమా వాళ్ళకు ఇచ్చిన విలువ ఓ సైనికునికి ఇవ్వలేదని విమర్శించారు. అంతేకాకుండా, కరోనా వచ్చిన వారు ఎంతటి కోటీశ్వరులైనా గాంధీలోనే చికిత్స చేసుకోవాలని సూచించిన సీఎం.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను మాత్రం యశోద ఆస్పత్రికి పంపించడం ఏంటని అనుమానం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News