ఆదర్శాన్ని ఆచరణలో చూపెట్టిన మోడీ

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ తాను చెప్పిన మాటను ఆచరణలో పెట్టి చూపించాడు. కరోనాపై పోరులో భాగంగా సొంత నియోజకవర్గం యూపీలోని వారణాసి ప్రజలు ముఖాలకు స్కార్ఫ్(కాటన్ వస్త్రం) కట్టుకోవాలని ప్రధాని మోడీ ఇటీవలే సూచించారు. అయితే, ఆ సూచనలను మాటలకే పరిమితం చేయలేదు. శనివారం ముఖ్యమంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖానికి వస్త్రాన్ని కట్టుకుని కనిపించారు. కరోనావైరస్ దేశంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ప్రధాని మోడీ ఇలా ముఖానికి స్కార్ఫ్ పట్టుకుని కనిపించడం ఇదే మొదటిసారి. […]

Update: 2020-04-11 03:38 GMT

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ తాను చెప్పిన మాటను ఆచరణలో పెట్టి చూపించాడు. కరోనాపై పోరులో భాగంగా సొంత నియోజకవర్గం యూపీలోని వారణాసి ప్రజలు ముఖాలకు స్కార్ఫ్(కాటన్ వస్త్రం) కట్టుకోవాలని ప్రధాని మోడీ ఇటీవలే సూచించారు. అయితే, ఆ సూచనలను మాటలకే పరిమితం చేయలేదు. శనివారం ముఖ్యమంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖానికి వస్త్రాన్ని కట్టుకుని కనిపించారు. కరోనావైరస్ దేశంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ప్రధాని మోడీ ఇలా ముఖానికి స్కార్ఫ్ పట్టుకుని కనిపించడం ఇదే మొదటిసారి. ప్రజలు మాస్క్‌లు ధరించాలని, హ్యాండ్‌మేడ్ మాస్క్‌లూ పెట్టుకోవాలని కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. ఇంటిలోనే మాస్క్‌ల తయారీకి సూచనలను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మాస్క్‌లు ధరించేందుకు ప్రోత్సహించేలా.. అన్నమాటను ఆచరణలో పెట్టినట్టుగా ప్రధాని మోడీ నేడు వీడియో కాన్ఫరెన్స్‌లో స్కార్ఫ్ కట్టుకుని సీఎంలతో చర్చించారు.

Tags: video conference, modi, cm’s, scarf, varanasi, handmade

Tags:    

Similar News