కేదార్‌నాథ్ ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు

దిశ, వెబ్‌డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. శుక్రవారం ఉదయం ఆలయంలోకి చేరుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. చార్‌ధామ్‌లో ప్రత్యేక పూజలు, కార్యక్రమాల అనంతరం ప్రధాని రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు‌ శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అంతే కాకుండా కేదార్ నాథ్‌లో స‌ర‌స్వతి ఘాట్‌ను ప్రారంభిస్తారు. అలాగే 130 కోట్ల ఇన్ఫ్రా ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభిచనున్నట్టు తెలుస్తోంది.

Update: 2021-11-04 22:26 GMT

Tags:    

Similar News