పెట్రో మంట.. మోదీ దిష్టిబొమ్మ దగ్ధం

దిశ, శేరిలింగంపల్లి: దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ సోమవారం సీపీఐ శేరిలింగంపల్లి మండల కార్యదర్శి కమకమామిడి శ్రీశైలం ఆధ్వర్యంలో న్యూ హఫీజ్ పేట్ మెయిన్ రోడ్డు మీద ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ.. సాధారణ ప్రజలు వాడుకునే పేట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల సరుకుల ధరలను కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచిందని, వాటిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ అధికారంలోకి […]

Update: 2021-06-07 05:04 GMT

దిశ, శేరిలింగంపల్లి: దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ సోమవారం సీపీఐ శేరిలింగంపల్లి మండల కార్యదర్శి కమకమామిడి శ్రీశైలం ఆధ్వర్యంలో న్యూ హఫీజ్ పేట్ మెయిన్ రోడ్డు మీద ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ.. సాధారణ ప్రజలు వాడుకునే పేట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల సరుకుల ధరలను కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచిందని, వాటిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు పెట్రోల్ ధరలు రూ.60 నుండి రూ.70 ఉండగా.. ఇప్పుడు పెట్రోల్ రేట్ సెంచరీ దాటిందన్నారు.

అప్పుడు గ్యాస్ ధర రూ. 350 నుంచి రూ.450 రుపాయుల ఉండగా.. ఇప్పుడు వెయ్యికి పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ శక్తుల లాభాల కోసమే బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచుతుందని శ్రీశైలం ఆరోపించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల సరుకుల ధరలను తగ్గించేంత వరకు పొరాటాన్ని ముందుకు తీసుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాహిళ సమైక్య నాయకురాలు బిపాషా, ఎండీ ఖాజా, రవి, సైలారిని, బాబా, షేమిన్ బేగం, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News