‘మోడీ, కేసీఆర్‌లు తోడు దొంగలు.. అందుకే అలా చేశారు’
దిశ ప్రతినిధి, నిజామాబాద్: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీకి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మోడీ, కేసీఆర్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ, కేసీఆర్ లు తోడు దొంగలుగా అభివర్ణించారు. సౌదీ అరేబియా, ఇరాన్‌లు క్రూడాయిల్ ధరలు […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీకి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మోడీ, కేసీఆర్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ, కేసీఆర్ లు తోడు దొంగలుగా అభివర్ణించారు.
సౌదీ అరేబియా, ఇరాన్‌లు క్రూడాయిల్ ధరలు తగ్గించినా ఎందుకు ఇంధనం ధరలు పెరిగాయో చెప్పాలని ప్రశ్నించారు. పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 40 ఉంటే.. కేంద్రం పన్నులు రూ.32, రాష్ట్రం పన్నులు రూ.27 లు అని వెల్లడించారు. ఇద్దరు తోడు దొంగలు మోడీ, కేసీఆర్ కూడబలుక్కొని సామాన్య ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారన్నారు. ప్రజల కోసమే ప్రభుత్వాలు అని చెప్పే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు వెంటనే ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.