వంటశాల లేని మోడల్ స్కూల్ .. ‘అలాంటి భోజనమే పెడుతున్నాం’
దిశ, ఓదెల : మండల కేంద్రమైన ఓదెలలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మోడల్ స్కూల్‌ను మంజూరు చేసింది. అన్ని సౌకర్యాలున్న వంటశాలలు లేకపోవడంతో మధ్యాహ్న భోజనం వండేందుకు వంట నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పది సంవత్సరాల కింద ఏపీ మోడల్ పాఠశాలలు మంజూరయ్యాయి. అందులో భాగంగానే పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి వెనుకబడిన ప్రాంతమైన ఓదెల మండల కేంద్రంలో ఒకటి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో పేద విద్యార్థులు అధికంగా […]
దిశ, ఓదెల : మండల కేంద్రమైన ఓదెలలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మోడల్ స్కూల్‌ను మంజూరు చేసింది. అన్ని సౌకర్యాలున్న వంటశాలలు లేకపోవడంతో మధ్యాహ్న భోజనం వండేందుకు వంట నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పది సంవత్సరాల కింద ఏపీ మోడల్ పాఠశాలలు మంజూరయ్యాయి. అందులో భాగంగానే పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి వెనుకబడిన ప్రాంతమైన ఓదెల మండల కేంద్రంలో ఒకటి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో పేద విద్యార్థులు అధికంగా ఉండడం ప్రయివేట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదివే స్థోమత లేకపోవడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మోడల్ స్కూల్ ను ఏర్పాటు చేసింది. దాదాపు 2. 70 కోట్లతో పాఠశాల నిర్మాణం చేపట్టారు. కొద్ది రోజుల కిందటే బాలికల వసతి గృహం కూడా ఏర్పాటు చేశారు. అన్నీఉన్నా వంటశాల మాత్రం ఏర్పాటు చేయకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు ఆరుబయట వంట చేసి పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు.
పాఠశాల ఏర్పాటు చేసినప్పటి నుంచి అధికారులు వంటగది ఏర్పాటు చేయడంలో కాలయాపన చేస్తున్నారు. ఇందుకు రాజకీయ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది సందిగ్ధంగా మారింది. చిన్న గాలి వచ్చినా, వర్షం వచ్చినా వంట ఏజెన్సీల పరిస్థితి చెప్పనక్కర్లేదు. వంటచేసే సమయంలో గాలికి చెత్తాచెదారం పదార్ధాలపై పడుతున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రహారి గోడ నిర్మాణం కూడా చేపట్టింది. పాఠశాలలో చాలా మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇంత పెద్ద పాఠశాలకు వంటశాల నిర్మాణం చేపట్టకపోవడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో చక్కటి విద్యను బోధించే ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ జావిద్ , వైస్ ప్రిన్సిపాల్ సుజాత వంటశాల నిర్మాణానికి ఎన్నో నివేదికనులు ప్రభుత్వానికి అందజేశారు. జాప్యం అవ్వడంలో కారణాలు తెలియని పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వంటశాల నిర్మాణం చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఎనిమిదేళ్ల నుంచి ఇదే గోస
నిర్వాహకురాలు రావుల స్వరూప
గత ఎనిమిది సంవత్సరాల నుంచి మోడల్ స్కూల్లో విద్యార్థులకు ఆరుబయట చెట్ల కింద వంట చేసి భోజనం పెడుతున్నామని తెలిపారు. ఎండకు ఎండుతూ వానకు నానుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. పాఠశాలకు వచ్చిన ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులకు మా గోస చెప్పుకున్న ఎవరూ పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి వంటగది నిర్మాణం చేపట్టాలని వేడుకుంటున్నాం.