జిల్లాల్లోనూ మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలు

దిశ, తెలంగాణ బ్యూరో : అతి త్వరలో జిల్లాల్లోనూ మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. జీహెచ్ఎంసీలో పది రోజుల పాటు స్పెషల్ వ్యాక్సినేషన్ పూర్తి కాగానే, 200 వాహనాలను జిల్లాలకు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. వీటిని అగ్రికల్చర్ క్లస్టర్లకు అనుసంధానం చేసి ఆయా పరిధిలోని రైతులు, కూలీలకు వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం మండల స్థాయి మెడికల్ అధికారులు, అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్, గ్రామ రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో జరగనుంది. […]

Update: 2021-08-24 08:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : అతి త్వరలో జిల్లాల్లోనూ మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. జీహెచ్ఎంసీలో పది రోజుల పాటు స్పెషల్ వ్యాక్సినేషన్ పూర్తి కాగానే, 200 వాహనాలను జిల్లాలకు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. వీటిని అగ్రికల్చర్ క్లస్టర్లకు అనుసంధానం చేసి ఆయా పరిధిలోని రైతులు, కూలీలకు వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం మండల స్థాయి మెడికల్ అధికారులు, అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్, గ్రామ రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే సుమారు 10 లక్షల డోసులను ఆరోగ్యశాఖ కొనుగోలు చేసింది.

ఇదిలా ఉండగా రాష్ర్టంలో కొత్తగా మరో 1,34,302 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో 1,00,138 మంది తొలి, 34,164 మంది రెండో డోసును పొందినట్లు ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ బులెటెన్ లో పేర్కొన్నది. దీంతో ఇప్పటి వరకు 1,26,68,683 మంది మొదటి, 43,27,428 మంది సెకండ్ డోసును తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ సెంటర్లలో 1,39,04,198, ప్రైవేట్ లో 30,91,913 డోసులు పంపిణీ చేశారు.

Tags:    

Similar News