సెల్‌ఫోన్ షాప్ ఓనర్ మతిపోగొట్టిన కరెంట్ బిల్
దిశ, జడ్చర్ల : ప్రతినెలా అతనికి వచ్చే కరెంటు బిల్లు సర్వసాధారణమే. తాజాగా బిల్లు లక్షల్లో రావడంతో ఒక్కసారిగా షాక్ అవడం అతని వంతు అయ్యింది. ఇదేంటి అని విద్యుత్ అధికారులను అడిగితే ముందు రీడింగ్ చూసుకో అని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పట్టణంలో కెవీ మొబైల్ రిపేరింగ్ షాప్ నడుపుతున్న వెంకటాచారి అనే నిర్వాహకుడు తన షాపులో కేవలం ఒక ఫ్యాన్, లైటు […]
దిశ, జడ్చర్ల : ప్రతినెలా అతనికి వచ్చే కరెంటు బిల్లు సర్వసాధారణమే. తాజాగా బిల్లు లక్షల్లో రావడంతో ఒక్కసారిగా షాక్ అవడం అతని వంతు అయ్యింది. ఇదేంటి అని విద్యుత్ అధికారులను అడిగితే ముందు రీడింగ్ చూసుకో అని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పట్టణంలో కెవీ మొబైల్ రిపేరింగ్ షాప్ నడుపుతున్న వెంకటాచారి అనే నిర్వాహకుడు తన షాపులో కేవలం ఒక ఫ్యాన్, లైటు మాత్రమే వినియోగించేవాడు. ప్రతీ నెల 200 నుండి 400 వందల రూపాయల దాకా మాత్రమే విద్యుత్ బిల్లు వస్తుండేది.
కానీ, ఈ నెల ఏకంగా రూ. 7లక్షల ఇరవై తొమ్మిది వేల 442 రూపాయలు విద్యుత్ బిల్లు రావడంతో షాప్ యాజమాని ఒక్కసారిగా అవాక్కయ్యాడు. అధికారులు మాత్రం మీటర్ రీడింగ్ అంతే ఉందని, తాము కూడా ఉన్న బిల్లు మాత్రమే ఇచ్చామని వినియోగదారుడికి తెలపడంతో చేసేది ఏమీ లేక వినియోగదారుడు మీడియాను ఆశ్రయించాడు. ప్రతినెలా వందల్లో వచ్చే విద్యుత్ బిల్లు ప్రస్తుతం లక్షల్లో రావడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని వాపోయాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తనకు లక్షల్లో బిల్లులు వేస్తే ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేశాడు వినియోగదారుడు.