క్షిపణుల కంటే మొబైల్ విస్తరించింది: రాజ్‌నాథ్ సింగ్
చండీగఢ్: క్షిపణులు కూడా వెళ్లలేని చోటుకూ మొబైల్ ఫోన్ పరిధి విస్తరించిందని, ప్రస్తుత పరిస్థితుల్లో సరిహద్దులు దాటకుండానే శత్రువు ప్రజలను చేరే అవకాశం ఉన్నదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడు సైనికుడి పాత్రను పోషించాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా, మొబైల్ యాప్‌ల ప్రభావాన్ని ఉటంకిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. తప్పుడు, పక్కదారి పట్టించే సమాచారం పట్ల మనల్ని మనం కాపాడుకుంటూ ఇతరులను కాపాడాల్సిన అవసరం ఉన్నదన్నారు. […]
చండీగఢ్: క్షిపణులు కూడా వెళ్లలేని చోటుకూ మొబైల్ ఫోన్ పరిధి విస్తరించిందని, ప్రస్తుత పరిస్థితుల్లో సరిహద్దులు దాటకుండానే శత్రువు ప్రజలను చేరే అవకాశం ఉన్నదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడు సైనికుడి పాత్రను పోషించాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా, మొబైల్ యాప్‌ల ప్రభావాన్ని ఉటంకిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. తప్పుడు, పక్కదారి పట్టించే సమాచారం పట్ల మనల్ని మనం కాపాడుకుంటూ ఇతరులను కాపాడాల్సిన అవసరం ఉన్నదన్నారు.
చండీగఢ్‌లో నిర్వహించిన వార్షిక మిలిటరీ సాహిత్యోత్సవంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ… ప్రస్తుతం కాలంతో పాటు భద్రతా పరమైన ముప్పులు కూడా మారాయని చెప్పారు. యుద్ధరీతిలో కూడా మార్పులు వచ్చాయని తెలిపారు. భవిష్యత్తులో మన ముందుకు విభిన్న రీతిలో భద్రతా ముప్పులు రావచ్చునని పేర్కొన్నారు. 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగి 50 ఏండ్లు పూర్తవుతున్నాయని, ఈ ఏడాది నిర్వహిస్తున్న సాహిత్యోత్సవం ఎంతో ప్రత్యేకమైందన్నారు. ఈ యుద్ధంలో దేశం కోసం పోరాడి పదవీ విరమణ చేసిన సైనికుల నుంచి యువత నేర్చుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్లలో యుద్ధానికి సంబంధించిన ఆటలు ఆడవచ్చు కానీ, నిజమైన యుద్ధానికి దానికి ఎంతో తేడా ఉంటుందన్నారు.