ప్రారంభమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్..
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 4గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటుచేశారు. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను 164 మంది అభ్యర్థులు […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 4గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటుచేశారు. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను 164 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఈసారి 10,36,833 మంది విద్యావంతులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. వివరాల వారీగా చూసుకుంటే.. హైదరాబాద్ స్థానంలో 93 మంది, నల్గొండ బరిలో 71మంది పోటీ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో 799 పోలింగ్ కేంద్రాలు, నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో 731 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం ఈనెల 17న ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాత ఫలితాలు వెలువడే చాన్స్ ఉంది. ఇదిలాఉండగా, ఓటర్ ఐడీ లేని వారు 9గుర్తింపు పొందిన కార్డుల్లో ఏదైనా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.