కానరాని పట్టభద్రులు

దిశ ‌ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభ‌మైన మంద‌కోడిగా సాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు స‌మీపంలో వివిధ రాజ‌కీయ పార్టీల నేత‌ల హ‌డావుడి క‌నిపిస్తోంది. అయితే ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డానికి పెద్దగా ప‌ట్టభ‌ద్రులు కాన‌రావ‌డం లేదు. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఓట‌ర్లు వ‌స్తార‌ని ఎన్నిక‌ల అధికారులు, సిబ్బంది అంచ‌నా వేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా పోలింగ్ కేంద్రాల‌ను ఆయా పార్టీల అభ్యర్థులు సంద‌ర్శిస్తున్నారు. వ‌రంగ‌ల్ అర్బన్ జిల్లా హ‌స‌న్‌ప‌ర్తిలోని పోలింగ్ కేంద్రాన్ని టీజేఎస్ ఎమ్మెల్సీ […]

Update: 2021-03-13 23:18 GMT

దిశ ‌ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభ‌మైన మంద‌కోడిగా సాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు స‌మీపంలో వివిధ రాజ‌కీయ పార్టీల నేత‌ల హ‌డావుడి క‌నిపిస్తోంది. అయితే ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డానికి పెద్దగా ప‌ట్టభ‌ద్రులు కాన‌రావ‌డం లేదు. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఓట‌ర్లు వ‌స్తార‌ని ఎన్నిక‌ల అధికారులు, సిబ్బంది అంచ‌నా వేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా పోలింగ్ కేంద్రాల‌ను ఆయా పార్టీల అభ్యర్థులు సంద‌ర్శిస్తున్నారు. వ‌రంగ‌ల్ అర్బన్ జిల్లా హ‌స‌న్‌ప‌ర్తిలోని పోలింగ్ కేంద్రాన్ని టీజేఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెస‌ర్ కోదండ‌రాం కొద్దిసేప‌టి క్రితం సంద‌ర్శించి.. పోలింగ్ స‌ర‌ళిపై స్థానిక నాయ‌కుల‌ను ఆరా తీశారు.‌

Tags:    

Similar News