ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు
దిశ, హన్మకొండ టౌన్: ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారి విశ్వ నారాయణకు నామినేషన్ పత్రాలు అందజేశారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండు నామినేషన్లు వేయగా, పోచంపల్లి తరపున మరో రెండు నామినేషన్లు పడ్డాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌తో కలిసి ఒక సెట్, మంత్రి సత్యవతి రాథోడ్, […]
దిశ, హన్మకొండ టౌన్: ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారి విశ్వ నారాయణకు నామినేషన్ పత్రాలు అందజేశారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండు నామినేషన్లు వేయగా, పోచంపల్లి తరపున మరో రెండు నామినేషన్లు పడ్డాయి.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌తో కలిసి ఒక సెట్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి మరో సెట్ నామినేషన్‌ను పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వేశారు. అనంతరం జెడ్పీ చైర్మన్లు కుసుమ జగదీష్, పాగాల సంపత్ రెడ్డి, చైర్ పర్సన్ గండ్ర జ్యోతిలు కలిసి ఒక సెట్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ మేయర్ సుధారాణి, ఎమ్మెల్యే నన్నపనేని కలిసి పోచంపల్లి తరపున మరో సెట్ నామినేషన్ వేశారు.
ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తోన్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విజయం ఖాయం అన్నారు. రైతు బంధువుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు, ఆదరణ టీఆర్ఎస్‌కు మెండుగా ఉన్నాయన్నారు. అందరి శ్రేయస్సు కోసం కేసీఆర్ పని చేస్తున్నారని చెప్పారు. దేశ వ్యాప్తంగా రైతులకు న్యాయం చేసే విధంగా కేసీఆర్ ఆలోచనలు ఉన్నాయని అన్నారు. రైతులకు అన్యాయం జరిగితే కేసీఆర్ తట్టుకోలేరని అభిప్రాయపడ్డారు.
అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండదండలు, మంత్రుల ఆశీర్వాదాలు, ఓటర్ల ఆదరాభిమానాలతో తాను మరోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నిక అవుతానని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పదవీ కాలం జనవరి 4తో ముగిసిపోనుంది. ఈ నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.