జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత సీక్రెట్ ఆపరేషన్.. అన్నతో కానిది చెల్లితో అయ్యేనా..?
దిశప్రతినిధి, కరీంనగర్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ సారి అన్నా చెల్లెల్లు ఇద్దరూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న టీఆర్ఎస్ తొలిసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలను గెలిపించుకోగా ఈసారి మాత్రం గట్టి పోటీనే ఎదురైంది. 27 మంది నామినేషన్లు వేయగా, చివరకు 10 మంది బరిలో నిలిచారు. అయితే, పోటీ చేయాలనుకున్న వారిని ఒప్పించేందుకు మంత్రి […]
దిశప్రతినిధి, కరీంనగర్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ సారి అన్నా చెల్లెల్లు ఇద్దరూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న టీఆర్ఎస్ తొలిసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలను గెలిపించుకోగా ఈసారి మాత్రం గట్టి పోటీనే ఎదురైంది. 27 మంది నామినేషన్లు వేయగా, చివరకు 10 మంది బరిలో నిలిచారు. అయితే, పోటీ చేయాలనుకున్న వారిని ఒప్పించేందుకు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లో నామినేషన్లు వేసిన వారితో చర్చలు జరిపి సఫలం అయ్యారు. వేములవాడ నియోజకవర్గానికి చెందిన మాదాసు వేణుతో ప్రత్యేకంగా చర్చించిన ఆయనను పోటీ నుంచి తప్పించడంలో సక్సెస్ అయ్యారు మంత్రి కేటీఆర్.
నేడు చెల్లి..
శనివారం కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన కవిత కూడా సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించినట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా స్థానిక సంస్థల ప్రతినిధులతో మాట్లాడకున్నప్పటికీ వారిని పార్టీకి అనుకూలంగా మల్చుకునేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు అర్థం అవుతోంది. మొదట కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేసిన అనంతరం తిరుగు ప్రయాణం కావల్సినప్పటికీ పర్యటనలో మార్పులు చేశారు. జిల్లాలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు చొరవ చూపిన ఎమ్మెల్యేలు తిరుగు ప్రయాణంలో ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మొదట జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ క్యాంప్ ఆఫీసుకు చేరుకున్న కవిత స్థానిక సంస్థల ప్రతినిధులను వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తరువాత చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సొంత గ్రామమైన గంగాధర మండలం బూరుగుపల్లికి చేరుకున్నారు. బూరుగుపల్లిలో కూడా స్థానిక సంస్థల ప్రతినిధులతో కవిత వ్యక్తిగతంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే, అంతర్గతంగా జరిగిన ఈ సమాచారాన్ని మాత్రం బయటకు లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఆమె పర్యటనలో ఎక్కువగా స్థానిక సంస్థల ప్రతినిధులు ఉండటం గమనార్హం. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు స్వాగతం పలికినప్పుడు కూడా కౌన్సెలర్లు ఉండటం గమనార్హం.
నైరాశ్యాన్ని తగ్గించేందుకేనా..?
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్లో నెలకొన్న నైరాశ్యాన్ని తగ్గించేందుకే మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నెలకొన్న పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలంటే తమ వంతు పాత్ర ఖచ్చితంగా ఉండాలని గుర్తించే వీరిద్దరూ ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా జోక్యం చేసుకున్నట్టుగా అర్థం అవుతోంది. ఏది ఏమైనా అన్నా చెల్లెల్లు ఇద్దరు కూడా అనుకూల సమీకరణాలకు పావులు కదపడం విశేషం.