'దిశ' కథనం.. స్పందించిన కవిత… వైద్యులకు అభినందనలు

దిశ, ముధోల్ : భైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఇప్పుడు అందరి మన్ననలు పొందుతోంది. కరోనా సోకిన 8 మంది గర్భవతులలో ఏడుగురికి నార్మల్ డెలివరీ, ఒకరికి సిజేరియన్ ద్వారా ప్రసవం చేసి తల్లీబిడ్డలను రక్షించడంతో ఆ ఆసుపత్రి వైద్యులను పలువురు అభినందిస్తున్నారు. కాగా ఈ విషయం నిన్న మొట్టమొదటిగా దిశ డిజిటల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇక ఈరోజు దిశ తో సహా పలు పత్రికల్లో ఈ వార్త ప్రచురితమైంది. దీంతో గర్భవతులకు ట్రీట్మెంట్ […]

Update: 2021-04-22 04:16 GMT

దిశ, ముధోల్ : భైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఇప్పుడు అందరి మన్ననలు పొందుతోంది. కరోనా సోకిన 8 మంది గర్భవతులలో ఏడుగురికి నార్మల్ డెలివరీ, ఒకరికి సిజేరియన్ ద్వారా ప్రసవం చేసి తల్లీబిడ్డలను రక్షించడంతో ఆ ఆసుపత్రి వైద్యులను పలువురు అభినందిస్తున్నారు. కాగా ఈ విషయం నిన్న మొట్టమొదటిగా దిశ డిజిటల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇక ఈరోజు దిశ తో సహా పలు పత్రికల్లో ఈ వార్త ప్రచురితమైంది. దీంతో గర్భవతులకు ట్రీట్మెంట్ ఇచ్చిన డా.వనిత ను ట్విట్టర్ ద్వారా అభినందించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

“విషయాన్ని ముందుగా వెలుగులోకి తెచ్చినందుకు డాక్టర్ వనిత ముధోల్ ‘దిశ’ ప్రతినిధికి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. మా సేవలు ఇలా వెలుగులోకి తీసుకువచ్చిన ‘దిశ’ మీడియాకి ప్రత్యేక అభినందనలు” అని తెలిపారు. కోవిడ్ గర్భవతికి సిజేరియన్ ద్వారా తల్లీబిడ్డను రక్షించినందుకు కవిత అభినందనలు తెలపటం తనకు చాలా సంతోషం ఇచ్చిందన్నారు డా.వనిత. ఇలాంటి ప్రశంసల ద్వారా సేవ చేయాలనే భావన మరింత పెరుగుతుందని ఆమె తెలియజేశారు.

కొవిడ్ గర్భవతులకు నార్మల్ డెలివరీ…

 

Tags:    

Similar News