కేంద్రం మెడలు వంచుతామని.. కేసీఆర్ తల దించుకున్నారు: జీవన్ రెడ్డి

దిశ, జగిత్యాల: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతామని చెప్పి ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ తల దించుకున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్ అధిష్టానం పిలుపుమేరకు ఆయన జగిత్యాలలోని తహశీల్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడలు దించుకున్న కేసీఆర్ రాష్ట్రంలో ఎలా అడుగుపెడుతారని ప్రశ్నించారు. కేసీఆర్ రైతుల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే తాము కూడా మద్దతు తెలిపేవారిమన్నారు. […]

Update: 2021-11-25 09:05 GMT
కేంద్రం మెడలు వంచుతామని.. కేసీఆర్ తల దించుకున్నారు: జీవన్ రెడ్డి
  • whatsapp icon

దిశ, జగిత్యాల: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతామని చెప్పి ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ తల దించుకున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్ అధిష్టానం పిలుపుమేరకు ఆయన జగిత్యాలలోని తహశీల్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడలు దించుకున్న కేసీఆర్ రాష్ట్రంలో ఎలా అడుగుపెడుతారని ప్రశ్నించారు. కేసీఆర్ రైతుల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే తాము కూడా మద్దతు తెలిపేవారిమన్నారు. కానీ, రాష్ట్రంలో రైతులను పట్టించుకోకుండా, ధర్నాల పేరుతో టీఆర్ఎస్‌ టూర్‌లు వేయడం సరికాదన్నారు. కళ్లాల వద్ద కుప్పలుగా పోసిన ధాన్యాన్ని ఇంకెప్పుడు కొంటారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేవరకు కాంగ్రెస్ పోరాటం సాగిస్తుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆర్డీవో మాధురికి వినతి పత్రం అందజేశారు.

Tags:    

Similar News