కరోనాతో పూజారి మృతి … అన్నితానైన ఎమ్మెల్యే
దిశ, నల్లగొండ: కరోనా సోకితే భయపడి కన్నవాళ్లే దరికిరాని రోజుల్లో… సమాజంలో గౌరవంగా బతికిన వ్యక్తి కరోనా తో విగతజీవిగా మారి అంతిమ సంస్కారానికి కూడా నోచుకోని పరిస్థితులలో, నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నీ తానై అంతిమ సంస్కారం నిర్వహించారు. ఆయన ఇప్పటికే నల్గొండ కరోనా వార్డులో రెండుసార్లు కలియతిరుగుతూ బాధితులకు వెన్ను తట్టి ధైర్యమిచ్చారు. జిల్లాలోని పాతబస్తీలో ఓ పూజరికుటుంబం కరోనా బారినపడ్డారు. అయితే ఆయన అంతిమ సంస్కారం నిర్వహించడానికి బంధువులు, స్థానికులు ఎవరూ […]
దిశ, నల్లగొండ: కరోనా సోకితే భయపడి కన్నవాళ్లే దరికిరాని రోజుల్లో… సమాజంలో గౌరవంగా బతికిన వ్యక్తి కరోనా తో విగతజీవిగా మారి అంతిమ సంస్కారానికి కూడా నోచుకోని పరిస్థితులలో, నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నీ తానై అంతిమ సంస్కారం నిర్వహించారు. ఆయన ఇప్పటికే నల్గొండ కరోనా వార్డులో రెండుసార్లు కలియతిరుగుతూ బాధితులకు వెన్ను తట్టి ధైర్యమిచ్చారు. జిల్లాలోని పాతబస్తీలో ఓ పూజరికుటుంబం కరోనా బారినపడ్డారు. అయితే ఆయన అంతిమ సంస్కారం నిర్వహించడానికి బంధువులు, స్థానికులు ఎవరూ ముందుకు రాకపోవడంతో స్థానిక కౌన్సిలర్ ఏడ్ల శ్రీనివాస్ ద్వారా విషయం తెలుసుకున్న శాసనసభ్యుడు స్వయంగా ముందుండి అంత్యక్రియలు నిర్వర్తించడం, వారి ఇంటికి వెళ్లి కరోనా తో బాధ పడుతున్న వారికి దైర్యం చెప్పి ఓదార్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
సమాజానికి, కుటుంబానికి సేవలందించిన వ్యక్తులు మరణిస్తే వారిని అనాధ శవాలుగా అగౌరపరచడం తగదని, తగు జాగ్రత్తలు తీసుకొని వారి అంతిమ సంస్కారాన్ని గౌరవపూర్వకంగా నిర్వర్తించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వెంట కంచర్ల మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు పిల్లి రామరాజు యాదవ్, కౌన్సిలర్ వట్టిపల్లి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.