మంత్రికి సొంత ఇలాకాలో ఎదురు దెబ్బ

          మహబూబాబాద్‌ జిల్లాలోని సహకార పోరులో ఓ మంత్రికి సొంత ఇలాకాలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే అత్యధిక స్థానాల్లో తన వర్గీయులను గెలిపించుకుని మంత్రిపై పైచేయి సాధించారు. వివరాల్లోకెళ్తే.. మంత్రి సత్యవతి రాథోడ్ స్వగ్రామమైనా కురవి మండలం గుండ్రాతి మడుగులో మొత్తం 13టీసీలకు రెండు ఏకగ్రీవమవ్వగా, మిగతా 11టీసీలకు జరిగిన ఎన్నికల్లో తొమ్మిదింట్లో ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అభ్యర్థులు గెలవగా, సత్యవతి వర్గం అభ్యర్థులు కేవలం రెండు స్థానాలకే పరిమితమయ్యారు. దీంతో […]

Update: 2020-02-15 09:29 GMT

మహబూబాబాద్‌ జిల్లాలోని సహకార పోరులో ఓ మంత్రికి సొంత ఇలాకాలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే అత్యధిక స్థానాల్లో తన వర్గీయులను గెలిపించుకుని మంత్రిపై పైచేయి సాధించారు. వివరాల్లోకెళ్తే.. మంత్రి సత్యవతి రాథోడ్ స్వగ్రామమైనా కురవి మండలం గుండ్రాతి మడుగులో మొత్తం 13టీసీలకు రెండు ఏకగ్రీవమవ్వగా, మిగతా 11టీసీలకు జరిగిన ఎన్నికల్లో తొమ్మిదింట్లో ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అభ్యర్థులు గెలవగా, సత్యవతి వర్గం అభ్యర్థులు కేవలం రెండు స్థానాలకే పరిమితమయ్యారు. దీంతో గుండ్రాతి మడుగు గ్రామంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మంత్రుల మధ్య జరిగిన వర్గపోరులో ఎమ్మెల్యేనే ఆధిపత్యాన్ని ప్రదర్శించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News