కరోనా బాధితులకు అండగా ఎమ్మెల్యే సీతక్క

దిశ,ములుగు : ఎమ్మెల్యే సీతక్క గత సంవత్సరం కరోనా కష్టకాలంలో ఎంతో మంది పేదలను ఆదుకుంది. అయితే ప్రస్తుతం జిల్లాలో కరోనా విజృంభన కొనసాగుతుంది. ఎంతో మంది పేదప్రజలు కరోనా బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి పేదలను అక్కున చేర్చుకుని నేను ఉన్నానంటూ వారికి సహాయకారిగా ఉంటుంది సీతక్క. ఈ నేపథ్యంలో జిల్లాలోని గోవిందరావు మండలంలో కరోనాతో బాధపడుతున్న పలు కుటుంబాలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క నిత్యావసర సరుకులను అందజేశారు. శనివారం మండలంలోని దుంపిల్లగూడెం, ఎల్బీనగర్, రాంనగర్ […]

Update: 2021-05-15 06:13 GMT

దిశ,ములుగు : ఎమ్మెల్యే సీతక్క గత సంవత్సరం కరోనా కష్టకాలంలో ఎంతో మంది పేదలను ఆదుకుంది. అయితే ప్రస్తుతం జిల్లాలో కరోనా విజృంభన కొనసాగుతుంది. ఎంతో మంది పేదప్రజలు కరోనా బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి పేదలను అక్కున చేర్చుకుని నేను ఉన్నానంటూ వారికి సహాయకారిగా ఉంటుంది సీతక్క. ఈ నేపథ్యంలో జిల్లాలోని గోవిందరావు మండలంలో కరోనాతో బాధపడుతున్న పలు కుటుంబాలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క నిత్యావసర సరుకులను అందజేశారు.

శనివారం మండలంలోని దుంపిల్లగూడెం, ఎల్బీనగర్, రాంనగర్ గ్రామాలలో కరోనాతో బాధపడుతున్న 35 మంది కరోనా బాధిత కుటుంబాలకు కెవీ ఫౌండేషన్ సహకారంతో , ములుగు ఎమ్మెల్యే సీతక్క నిత్యావసర సరుకులు బియ్యం , పప్పు , పంపిణీ చేశారు . అదే విధంగా గ్రామానికి చెందిన సంపటి ఉప్పలయ్య , అజ్మీరా జగిని , పోరిక హన్మంతులు కరోనాతో మృతిచెందగా వారి కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు అందించారు . ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కరోనా తీవ్రత అధికంగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులను ధరించాలని సూచించారు . అవసరం ఉంటే తప్ప ఇంట్లో నుండి ప్రజలు బయటకు రావద్దని అన్నారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News