నిరుద్యోగులకు ఎమ్మెల్యే సీతక్క గుడ్ న్యూస్
దిశ, ములుగు : ములుగు నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఎమ్మెల్యే సీతక్క తీపికబురు అందించారు. సెప్టెంబర్ 2న నిరుద్యోగ యువతీ యువకుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంగళవారం మీడియాతో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడువాయి, ఏటునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండల నిరుద్యోగుల కోసం సెప్టెంబర్ 2వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని వివిధ కంపెనీల వారు 300 మందికి ( 15 వేల జీతం )తో ఉద్యోగాలు […]
దిశ, ములుగు : ములుగు నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఎమ్మెల్యే సీతక్క తీపికబురు అందించారు. సెప్టెంబర్ 2న నిరుద్యోగ యువతీ యువకుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంగళవారం మీడియాతో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడువాయి, ఏటునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండల నిరుద్యోగుల కోసం సెప్టెంబర్ 2వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని వివిధ కంపెనీల వారు 300 మందికి ( 15 వేల జీతం )తో ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సీతక్క తెలిపారు. పదో తరగతి పాసై, 21 ఏళ్ళు నిండినవారు సంబంధిత పత్రాలతో సెప్టెంబర్ 2 గురువారం ఉ. 11 గం.కు జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ కు రావాలని ఈ సందర్భంగా ఆమె నిరుద్యోగ యువతను కోరారు.