బండి సంజయ్‌కు శానంపూడి సవాల్

దిశ, వెబ్‌డెస్క్: హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలిస్తే.. కేసీఆర్ రూ.100కోట్లు ఇస్తానన్నారని, అవి ఏమయ్యాయో చెప్పాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి స్పందించారు. హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలిచిన తర్వాత కేసీఆర్ చొరవతో నియోజకవర్గం తలరాత మారిందని, రూ.100కోట్ల కంటే ఎక్కువే నిధులిచ్చి అభివృద్ధి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ విషయంపై బండి సంజయ్‌తో చర్చించేందుకు సిద్ధమని, దమ్ముంటే బుధవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు రావాలని సవాల్ విసిరారు. హుజూర్‌నగర్‌లో ఆర్డీవో ఆఫీస్‌తో […]

Update: 2020-11-03 05:16 GMT
బండి సంజయ్‌కు శానంపూడి సవాల్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలిస్తే.. కేసీఆర్ రూ.100కోట్లు ఇస్తానన్నారని, అవి ఏమయ్యాయో చెప్పాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి స్పందించారు. హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలిచిన తర్వాత కేసీఆర్ చొరవతో నియోజకవర్గం తలరాత మారిందని, రూ.100కోట్ల కంటే ఎక్కువే నిధులిచ్చి అభివృద్ధి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ విషయంపై బండి సంజయ్‌తో చర్చించేందుకు సిద్ధమని, దమ్ముంటే బుధవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు రావాలని సవాల్ విసిరారు. హుజూర్‌నగర్‌లో ఆర్డీవో ఆఫీస్‌తో పాటు, మేళ్లచెరువులో గిరిజన సంక్షేమ కాలేజీ, రూ. కోటిన్నరతో బంజారాభవన్ నిర్మించుకుంటున్నామని తెలిపారు.

హుజూర్‌నగర్ మున్సిపాలిటీకి రూ.25కోట్లు, నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ.15కోట్లతో పాటు ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20లక్షలు కేటాయించారని, మండల కేంద్రానికి రూ. 30లక్షలు, నక్కగూడెం లిప్ట్‌లకు రూ.25కోట్లు కేటాయించారన్నారు. చెక్‌డ్యామ్‌ల కోసం రూ.27కోట్లు, రూ.33కోట్లతో మిషన్‌ భగీరథ పనులు చేపట్టామని, ఈఎస్ఐ ఆస్పత్రికి నోటిఫికేషన్ ఇచ్చి రూ.5ఎకరాల భూమి కేటాయించామని వెల్లడించారు. ఉపఎన్నిక సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలోని అంశాలన్నింటినీ అమలు చేశామన్నారు. హుజూర్‌నగర్‌లో బీజేపీకి 2600 ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు.

Tags:    

Similar News