ఎలక్షన్ వన్ సైడే : ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
దిశ, హుజూర్‌నగర్: స్థానిక సంస్థల ఎన్నికలు వన్ సైడ్‌గా ఉంటాయని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సైదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసిఆర్ తీసుకువచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో, ప్రతిపక్షాలు నామినేషన్ వేసే పరిస్థితి లేదన్నారు. నిలబడితే ఓట్లు పడవనే భయం వారిలో ఉందన్నారు. ఏ ఎన్నికలలో అయినా టీఆర్ఎస్ వందకు వంద శాతం గెలుస్తుందని పేర్కొన్నారు. […]
దిశ, హుజూర్‌నగర్: స్థానిక సంస్థల ఎన్నికలు వన్ సైడ్‌గా ఉంటాయని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సైదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసిఆర్ తీసుకువచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో, ప్రతిపక్షాలు నామినేషన్ వేసే పరిస్థితి లేదన్నారు. నిలబడితే ఓట్లు పడవనే భయం వారిలో ఉందన్నారు. ఏ ఎన్నికలలో అయినా టీఆర్ఎస్ వందకు వంద శాతం గెలుస్తుందని పేర్కొన్నారు. దేశ చరిత్రలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలుస్తుందన్నారు. ఇక బీజేపీకీ నామినేషన్ వేయడానికే అభ్యర్థులే లేరని.. బీజేపి రాష్ట్రానికి ఏం చేసిందనే ప్రశ్నకు ఆ పార్టీ దగ్గర సమాధానమే లేదని ఎద్దేవా చేశారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు గెల్లి రవి కుమార్ ఉన్నారు.