నిధులిస్తే అభివృద్ధి చేసుకుంటాం.. మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే

దిశ, జగిత్యాల : జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని కోరుతూ గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. హైదరాబాద్‌లోని కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి జగిత్యాల ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పలు అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. బీర్ పూర్ మండలం మంగెళ గ్రామంలో గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల నూతన భవనానికి నిధులు, […]

Update: 2021-11-11 05:25 GMT

దిశ, జగిత్యాల : జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని కోరుతూ గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. హైదరాబాద్‌లోని కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి జగిత్యాల ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పలు అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. బీర్ పూర్ మండలం మంగెళ గ్రామంలో గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల నూతన భవనానికి నిధులు, జిల్లాకు నూతన గిరిజన సంక్షేమ అధికారిని నియమించాలని కోరారు.

అంతేకాకుండా ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌ను ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ప్రభుత్వ భూమిని సైతం ఎంపిక చేశామన్నారు. అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని కోరారు. నియోజకవర్గంలో పలు అంగన్‌‌ వాడీలు పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని, మూత్రశాలలు, మరుగుదొడ్లకు సైతం నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి నిధుల విడుదలతో పాటు అధికారిని నియమిస్తామని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News