జర్నలిస్ట్ కుటుంబానికి ఆపన్నహస్తం అందించిన ఎమ్మెల్యే
దిశ, మణుగూరు: జర్నలిస్టులంటే తనకు అభిమానం అని, జర్నలిస్ట్ వృత్తి చేసే అందరూ మహానుభావులని పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. శనివారం పినపాక నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని, ముప్పు ప్రాంతాలను సందర్శించారు. అనంతరం గత ఐదు రోజులుగా జిల్లాలో భారీ కురిసిన వర్షాలకు కొత్తగూడెం పట్టణంలోని మన్యం మీడియా రిపోర్టరుగా పనిచేస్తున్న చింతల చిరంజీవి ఇళ్లు కూలీ, నిరాశ్రయుడయ్యారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే హుటాహుటిన కొత్తగూడెం వచ్చి, చిరంజీవి కుటుంబాన్ని […]
దిశ, మణుగూరు: జర్నలిస్టులంటే తనకు అభిమానం అని, జర్నలిస్ట్ వృత్తి చేసే అందరూ మహానుభావులని పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. శనివారం పినపాక నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని, ముప్పు ప్రాంతాలను సందర్శించారు. అనంతరం గత ఐదు రోజులుగా జిల్లాలో భారీ కురిసిన వర్షాలకు కొత్తగూడెం పట్టణంలోని మన్యం మీడియా రిపోర్టరుగా పనిచేస్తున్న చింతల చిరంజీవి ఇళ్లు కూలీ, నిరాశ్రయుడయ్యారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే హుటాహుటిన కొత్తగూడెం వచ్చి, చిరంజీవి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.1 లక్ష ఆర్థికసాయం అందజేశారు. రేగా చేసిన సేవను చూసి కొత్తగూడెం జర్నలిస్టులు, పలువురు నాయకులు అభినందించారు.