‘దళిత,గిరిజనులపై కేసీఆర్ దొరలపాలన.. ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాలి’

దిశ,మణుగూరు : ఆదివారం మండలంలోని పద్మశాలి భవనంలో పినపాక నియోజకవర్గ కోకన్వీనర్ గురిజాలగోపి అధ్యక్షతన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా మహిళ నాయకులు తోట దేవి ప్రసన్న, టీపీసీసీ ఉపాధ్యక్షులు, భద్రాచలం శాసనసభ్యులు పొదేం వీరయ్య, సెక్రెటరీ టీపీసీసీ కోఆర్డినేటర్ పినపాక నియోజకవర్గ సుదర్శన్ ప్రసాద్ తివారీ పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతూ.. రాష్టంలో దళితుల,గిరిజనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ దొరలపాలన చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ఎన్నికల్లో […]

Update: 2021-09-12 10:50 GMT

దిశ,మణుగూరు : ఆదివారం మండలంలోని పద్మశాలి భవనంలో పినపాక నియోజకవర్గ కోకన్వీనర్ గురిజాలగోపి అధ్యక్షతన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా మహిళ నాయకులు తోట దేవి ప్రసన్న, టీపీసీసీ ఉపాధ్యక్షులు, భద్రాచలం శాసనసభ్యులు పొదేం వీరయ్య, సెక్రెటరీ టీపీసీసీ కోఆర్డినేటర్ పినపాక నియోజకవర్గ సుదర్శన్ ప్రసాద్ తివారీ పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతూ.. రాష్టంలో దళితుల,గిరిజనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ దొరలపాలన చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుకోసం కొత్తగా కేసీఆర్ దళితబందు అనే పేరుతో రాష్టాన్ని దగా చేస్తున్నాడాని మండిపడ్డారు.రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసి, ముఖ్యమంత్రి గద్దెమీద కూర్చొని దళితులకు మూడుఎకరాలు ఇస్తానని చెప్పి దళితులను మూడు చేరువు నీళ్లు తాగిపిస్తున్నాడని మండిపడ్డారు.

కరోనా విపత్కర పరిస్థిలలో కూడా రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెంచి పేదప్రజల నడ్డివిరిశాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం గురించి ప్రజలకు తెలియజేస్తున్న పత్రిక విలేకరులపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే 2023 ఎన్నికల్లో ప్రజలు ఓట్లతోనే బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. పినపాక నియోజక వర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ ఓట్లతో గెలిచి,నియోజకవర్గ అభివృద్ధి కోసం అని ప్రజలను మభ్యపెట్టి పార్టీ మరీన నిచూడని మండిపడ్డారు. రేగాకు కాంగ్రెస్ పార్టీ బతుకునిస్తే కన్నతల్లిలాంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి,ఈరోజున కేసీఆర్ తో కలిసి పినపాక నియోజకవర్గన్నీ అరచకపాలన చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే రేగా 2023 ఎన్నికల్లో ఓట్లకోసం నియోజకవర్గంలో తిరిగితే ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఎప్పటికైనా రేగా పద్దతి మార్చుకొని ప్రజలకు సేవచేయాలని కోరారు. లేనిచో రాజీనామా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం సుధాకర్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు పీరనాకి నవీన్, కరకగూడెం మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బల్ హుస్సేన్,నియోజక వర్గ యూత్ ఉపాధ్యక్షుడు కొరస ఆనంద్, మణుగూరు మండల యూత్ అధ్యక్షుడు ఎమ్. డి.రషీద్, భూర్గంపాడు మండల అధ్యక్షురాలు బర్ల నాగమణి, పోరెడ్డి విజయలక్ష్మి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Tags:    

Similar News