ఎమ్మెల్యే దెబ్బకు అధికారులు పరుగో పరుగు..!
దిశ, ఏపీ బ్యూరో: రోడ్డంతా గుంతలమయం కావడంతో ఎలాంటి హడావుడి లేకుండా ఓ ఎమ్మెల్యే సింపుల్‌గా అదే రోడ్డుపైనే బైఠాయించారు. ప్రజాప్రతినిధి రోడ్డు మీద కూర్చొని ఎందుకు నిరసన తెలుపుతున్నారని జనం అక్కడకు చేరుకున్నారు. పరిస్థితి ఇది అని తెలిసిన వెంటనే సంబంధిత అధికారులు అక్కడకు పరుగులు తీశారు. త్వరలోనే మరమ్మత్తులు చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన శాంతించారు. ఈ ఘటన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని కాళ్ల మండలం సీసలిలో రోడ్లన్నీ […]
దిశ, ఏపీ బ్యూరో: రోడ్డంతా గుంతలమయం కావడంతో ఎలాంటి హడావుడి లేకుండా ఓ ఎమ్మెల్యే సింపుల్‌గా అదే రోడ్డుపైనే బైఠాయించారు. ప్రజాప్రతినిధి రోడ్డు మీద కూర్చొని ఎందుకు నిరసన తెలుపుతున్నారని జనం అక్కడకు చేరుకున్నారు. పరిస్థితి ఇది అని తెలిసిన వెంటనే సంబంధిత అధికారులు అక్కడకు పరుగులు తీశారు. త్వరలోనే మరమ్మత్తులు చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన శాంతించారు.
ఈ ఘటన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని కాళ్ల మండలం సీసలిలో రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. మరమ్మతులు చేయాలని ఎప్పటి నుంచో ఆ ఎమ్మెల్యే కోరుతున్నారు. ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గత్యంతరం లేక టీడీపీకి చెందిన ఎమ్మెల్యే మంతెన రామరాజు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పేవరకూ కదలనని రోడ్డుపైనే నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు చేరుకున్నారు. పది రోజుల్లో మరమ్మతులు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.