ఘరానా మోసగాడికి షాకిచ్చిన రజిని 

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. తన సమయస్ఫూర్తితో ఘరానా మోసగాడికే షాకిచ్చారు. ఈమధ్య కేటుగాళ్లు రాజకీయ నాయకులని టార్గెట్ చేసుకుని డబ్బు నొక్కేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. ఇదే తరహాలో ఎమ్మెల్యే రజిని ని బురిడీ కొట్టించి డబ్బు కొట్టేయడానికి ట్రై చేశాడు ఓ వ్యక్తి. కానీ విడదల రజిని అతని మాయమాటలు నమ్మలేదు. తెలివిగా వ్యవహరించి అతడిని పోలీసులకు పట్టించింది. వివరాల్లోకి వెళితే… సీఎం ఆఫీసు నుండి ఫోన్ చేస్తున్నాను. జగన్‌ మీతో మాట్లాడమన్నారు. భారీ మొత్తంలో రుణాలు ఇస్తామంటూ ఎమ్మెల్యే రజినీకి ఫోన్ చేసి నమ్మబలికాడు. అయితే.. రుణం కావాలంటే ముందుగానే కొంత మొత్తం […]

Update: 2020-09-10 00:05 GMT

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. తన సమయస్ఫూర్తితో ఘరానా మోసగాడికే షాకిచ్చారు. ఈమధ్య కేటుగాళ్లు రాజకీయ నాయకులని టార్గెట్ చేసుకుని డబ్బు నొక్కేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారు.

ఇదే తరహాలో ఎమ్మెల్యే రజిని ని బురిడీ కొట్టించి డబ్బు కొట్టేయడానికి ట్రై చేశాడు ఓ వ్యక్తి. కానీ విడదల రజిని అతని మాయమాటలు నమ్మలేదు. తెలివిగా వ్యవహరించి అతడిని పోలీసులకు పట్టించింది.

వివరాల్లోకి వెళితే… సీఎం ఆఫీసు నుండి ఫోన్ చేస్తున్నాను. జగన్‌ మీతో మాట్లాడమన్నారు. భారీ మొత్తంలో రుణాలు ఇస్తామంటూ ఎమ్మెల్యే రజినీకి ఫోన్ చేసి నమ్మబలికాడు. అయితే.. రుణం కావాలంటే ముందుగానే కొంత మొత్తం చెల్లించాలి అని చెప్పడంతో… అనుమానించిన రజిని, అతని వివరాలు సేకరించారు.

విశాఖకు చెందిన జగజ్జీవన్‌ అనే పేరుతో సీఎం కార్యాలయంలో ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీశారు. అలాంటి పేరుతో ఎవరూ లేరని నిర్ధారించుకున్నారు రజిని. అతడితో ఫోన్‌లో మాట్లాడుతూనే డీజీపీతో పాటు గుంటూరు అర్బన్‌ ఎస్పీకి విషయాన్ని తెలియజేశారు. తర్వాత పట్టాభిపురం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

గతంలో రాయచోటికి చెందిన ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ను కూడా ఇదే వ్యక్తి డబ్బులు అడిగినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెడతామని పోలీసులు వెల్లడించారు.

Read Also…

‘ప్లాస్మా’ ఇవ్వనున్న డిప్యూటీ సీఎం..

Full View

Tags:    

Similar News