దుబ్బాక ఉద్యమాల గడ్డ.. టీఆర్‌ఎస్‌కు అడ్డా!
దిశ, దుబ్బాక : దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ ప్రచార తీరు, సిద్దిపేట ఉద్రిక్తతలపై మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మానుకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పందించారు. దుబ్బాక నియోజకవర్గం ‘ఉద్యమాల గడ్డ..టీఆర్‌ఎస్‌కు అడ్డ’ అని వ్యాఖ్యానించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నీలకంఠ ఫంక్షన్ హాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో పట్టుబడిన రూ.18 లక్షలపై కొత్త నాటకం ఆడటం ఆయనకే చెల్లిందన్నారు. బీజేపీ […]
దిశ, దుబ్బాక : దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ ప్రచార తీరు, సిద్దిపేట ఉద్రిక్తతలపై మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మానుకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పందించారు. దుబ్బాక నియోజకవర్గం ‘ఉద్యమాల గడ్డ..టీఆర్‌ఎస్‌కు అడ్డ’ అని వ్యాఖ్యానించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నీలకంఠ ఫంక్షన్ హాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో పట్టుబడిన రూ.18 లక్షలపై కొత్త నాటకం ఆడటం ఆయనకే చెల్లిందన్నారు. బీజేపీ రఘునందన్ హైడ్రామా, నటనతో అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఒకపక్క భర్తను పోగుట్టుకుని సుజాతక్క కన్నీరుపెట్టుకుంటే దానిని ఎక్కిరించే రఘునందన్ రావుకు ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. నిన్న జరిగిన హైడ్రామాలో బీజేపీ నాయకులు తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారని వ్యాఖ్యానించారు. డీకే అరుణకు దుబ్బాక గురించి ఏమీ తెలుసని మాట్లాడుతున్నదని ప్రశ్నించారు. మీరు ఎన్ని డ్రామాలాడిన 3వ తారీఖున దుబ్బాక ప్రజలు రఘునందన్‌కు బుద్ధి చెబుతారని పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు.
రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. వాళ్లింట్లో డబ్బులు దొరికితే మా డబ్బులు కావనడం సిగ్గుచేటన్నారు. కన్నీళ్లను కూడా ఎన్నికలకు వాడుకునే పరిస్థితి బీజేపీకి దాపురించిందని విమర్శించారు. డిపాజిట్ రాదనే విషయం తెలిసి ఏదో ఒక రకంగా బట్టకాల్చి మీదేస్తున్న బీజేపీకి దుబ్బాక ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కరీంనగర్‌లో ఉంటూ బండి సంజయ్ దుబ్బాకలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుండని రసమయి ఆరోపించారు. వాటన్నంటినీ దుబ్బాక ప్రజలు తిప్పికొడతారని, ఇది ఉద్యమాలకు మారు పేరు అని రసమయి చెప్పుకొచ్చారు.