మా ఊరి మీద నుంచి ఎలా వెళ్తావు.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి భారీ షాక్
దిశ, జనగామ : జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భారీ షాక్ తగిలింది. నర్మెట్ట మండలం కేంద్రం ఇప్పలగడ్డ పంచాయతీ పరిధిలోని రత్నాతండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కొందరు గ్రామస్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. తమ ఊరికి రోడ్డు వేయిస్తానని చెప్పి నేటివరకు ఎందుకు వేయించలేదంటూ గ్రామస్థులు ఎమ్మెల్యేను నిలదీశారు. కాన్వాయ్‌ను అడ్డుకుని పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శనివారం పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా నర్మెట […]
దిశ, జనగామ : జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భారీ షాక్ తగిలింది. నర్మెట్ట మండలం కేంద్రం ఇప్పలగడ్డ పంచాయతీ పరిధిలోని రత్నాతండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కొందరు గ్రామస్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. తమ ఊరికి రోడ్డు వేయిస్తానని చెప్పి నేటివరకు ఎందుకు వేయించలేదంటూ గ్రామస్థులు ఎమ్మెల్యేను నిలదీశారు. కాన్వాయ్‌ను అడ్డుకుని పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శనివారం పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా నర్మెట మండలం మచ్చుపహాడ్‌కు వెళ్తుండగా రత్నతండా గ్రామస్థులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు.
‘మా ఊరి మీద నుంచి ఎలా వెళ్తున్నవ్.. ఎప్పుడు దారేస్తావ్ అంటూ నిలదీశారు. గత ఎన్నికల్లో ఊరికి రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చి.. ఇప్పటి వరకు చేయకపోవడానికి కారణం ఏంటి..? అంటూ ప్రశ్నించారు.నర్మెట్ట మండలం మీదుగా వెళ్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్‌ను నిరసనకారులు అడ్డుకోవడంతో ఆయన కోపంతో రగిలిపోయారు. బలవంతంగా పోలీసుల సాయంతో వారిని చెదరగొట్టించారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు ఎమ్మెల్యే కారు కింద పడేందుకు యత్నించగా అతన్ని పోలీసులు బలవంతంగా లాగిపడేశారు. దీనికి సంబంధించి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలాఉండగా, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పోలీసులు నిరసన కారుల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఆందోళన సమయంలో స్థానిక ప్రజలకు, టీఆర్ఎస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులకు ఎమ్మెల్యే ఏదో సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తీరా ఆందోళనకారులను శాంతింప జేసి ఎలాగోలా ఎమ్మెల్యే అక్కడి నుంచి జారుకున్నారు. అనంతరం తండావాసులు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు తండాకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పిన ఎమ్మెల్యే కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తంచేశారు. రోడ్డు వేయించమని అడిగినప్పుడల్లా మాట దాటవేస్తున్నారని వాపోయారు. అందువల్లే గ్రామ పరిధిలోకి వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకుని నిరసన చేపట్టామన్నారు.