ప్రకృతిని మనం కాపాడితే.. అది మనల్ని కాపాడుతుంది
దిశ, ముషీరాబాద్: మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ పిలుపునిచ్చారు. శుక్రవారం హరితహారంలో భాగంగా హైదరాబాద్‌లోని నగర కేంద్ర గ్రంథాలయం ఆవరణలో మొక్కలు నాటారు. అనంరతం ఆయన మాట్లాడుతూ… ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందన్నారు. నేడు సమాజంలో పీల్చేందుకు స్వచ్ఛమైన గాలి కరువైందని, ప్రజలు ఆక్సిజన్ అందక వివిధ రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకుని పచ్చదనాన్ని పెంపొందించుకుంటే కరోనా మహమ్మారి జయించవచ్చన్నారు. అందరూ విధిగా మొక్కలు నాటి వాటిని […]
దిశ, ముషీరాబాద్: మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ పిలుపునిచ్చారు. శుక్రవారం హరితహారంలో భాగంగా హైదరాబాద్‌లోని నగర కేంద్ర గ్రంథాలయం ఆవరణలో మొక్కలు నాటారు. అనంరతం ఆయన మాట్లాడుతూ… ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందన్నారు. నేడు సమాజంలో పీల్చేందుకు స్వచ్ఛమైన గాలి కరువైందని, ప్రజలు ఆక్సిజన్ అందక వివిధ రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకుని పచ్చదనాన్ని పెంపొందించుకుంటే కరోనా మహమ్మారి జయించవచ్చన్నారు. అందరూ విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.