రైతులకు కంది విత్తనాల పంపిణీ

దిశ, మెదక్: వ్యవసాయ అధికారుల సూచనలతో రైతులు అధిక దిగుబడులు సాధించాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని సోలక్పల్లి, వావిలాల, గుమ్మడిదల సొసైటీల్లో ఎమ్మెల్యే తన సొంత నిధులతో 62 క్వింటాళ్ల కంది విత్తనాలను పంపిణీ చేశారు. డిమాండ్ ఉన్న పంటల్ని పండించాలన్న ప్రభుత్వం సూచనలను ప్రతి ఒక్క రైతు పాటించాలని కోరారు. ఈ సందర్భంగా వావిలాల సొసైటీలో నాలుగు క్వింటాళ్లు, సోలక్పల్లి సొసైటీలో నాలుగు […]

Update: 2020-06-09 06:12 GMT

దిశ, మెదక్: వ్యవసాయ అధికారుల సూచనలతో రైతులు అధిక దిగుబడులు సాధించాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని సోలక్పల్లి, వావిలాల, గుమ్మడిదల సొసైటీల్లో ఎమ్మెల్యే తన సొంత నిధులతో 62 క్వింటాళ్ల కంది విత్తనాలను పంపిణీ చేశారు. డిమాండ్ ఉన్న పంటల్ని పండించాలన్న ప్రభుత్వం సూచనలను ప్రతి ఒక్క రైతు పాటించాలని కోరారు. ఈ సందర్భంగా వావిలాల సొసైటీలో నాలుగు క్వింటాళ్లు, సోలక్పల్లి సొసైటీలో నాలుగు క్వింటాళ్లు , గుమ్మడిదల సొసైటీలో 52 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్ , ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

Tags:    

Similar News