మావాళ్లకు సందర్శించే హక్కు లేదా?

దిశ, మెదక్: కాంగ్రెస్ నేతలకు ప్రాజెక్ట్‌లను సందర్శించే హక్కు లేదా అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న నేతలను హౌజ్ అరెస్ట్ చేయటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా నాయకులకు ప్రాజెక్ట్ సందర్శించే హక్కు లేదా? ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తే అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం’ అని ప్రశ్నించారు. ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వం కావాలనే ఇదంతా చేస్తుందని మండిపడ్డారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన […]

Update: 2020-06-13 05:29 GMT

దిశ, మెదక్: కాంగ్రెస్ నేతలకు ప్రాజెక్ట్‌లను సందర్శించే హక్కు లేదా అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న నేతలను హౌజ్ అరెస్ట్ చేయటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా నాయకులకు ప్రాజెక్ట్ సందర్శించే హక్కు లేదా? ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తే అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం’ అని ప్రశ్నించారు. ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వం కావాలనే ఇదంతా చేస్తుందని మండిపడ్డారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే ప్రభుత్వం అరెస్టులు చేయిస్తుందని ఆరోపించారు.

Tags:    

Similar News