అచ్చంపేట అసెంబ్లీకి ఉప ఎన్నికలు.. ఎమ్మెల్యే పదవికి గువ్వల బాలరాజు రాజీనామా..?

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గెలిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వెలువడుతున్న కౌంటింగ్ ఫలితాల ప్రకారం ఈటల రాజేందర్ గెలుపు ఖాయంగా తెలుస్తోంది. దీంతో ఈటల గెలిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన గువ్వల బాలరాజు మాట మీద నిలబడుతారని, దీంతో అచ్చంపేటకు మరోసారి ఉపఎన్నికల వస్తుందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం […]

Update: 2021-11-02 07:00 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గెలిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వెలువడుతున్న కౌంటింగ్ ఫలితాల ప్రకారం ఈటల రాజేందర్ గెలుపు ఖాయంగా తెలుస్తోంది. దీంతో ఈటల గెలిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన గువ్వల బాలరాజు మాట మీద నిలబడుతారని, దీంతో అచ్చంపేటకు మరోసారి ఉపఎన్నికల వస్తుందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది.

హుజురాబాద్ ఉపఎన్నికల్లో గువ్వల బాలరాజు స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటల గెలిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఓ టీవీ ఛానల్ డిబేట్‌లోనూ గువ్వల ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. బీజేపీకి తెలంగాణలో డిపాజిట్ కూడా రాదని, ఒకవేళ కాంగ్రెస్‌తో కలిస్తే పోటీ చేస్తే డిపాజిట్ రావొచ్చని జోస్యం చెప్పారు. బీజేపీ గెలుపు దాదాపు అసాధ్యం అని, అదే జరిగితే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఈటల గెలుపు దాదాపు ఖరారైపోయిందని భావించిన ఓటర్లు, నెటిజన్లు ఆయన డైలాగ్స్‌ను సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు. ఉపఎన్నికలు వస్తేనే తమ నియోజకవర్గమైన అచ్చంపేట కూడా అభివృద్ధిని సాధిస్తుందని నెటిజన్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు.

Tags:    

Similar News