అందరి దీవెనలతో కరోనాను జయించాను

దిశ, పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, దీవెనలతో కరోనాను జయించానని, ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్టు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గతకొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు తన ఆరోగ్య విషయమై వీడియో సందేశం విడుదల చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే తనకు […]

Update: 2020-08-18 06:34 GMT
అందరి దీవెనలతో కరోనాను జయించాను
  • whatsapp icon

దిశ, పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, దీవెనలతో కరోనాను జయించానని, ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్టు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గతకొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు తన ఆరోగ్య విషయమై వీడియో సందేశం విడుదల చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే తనకు కరోనా రావడం పెద్ద విషయం కాదని, ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు.

మరి కొద్ది రోజుల అనంతరం నియోజకవర్గ స్థాయిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ విధిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. ప్రజా ప్రతినిధులు అందరూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజలందరి ఆశీస్సులతో పటాన్‌చెరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకొని వెళ్లనున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News